అనంతపురం జిల్లాలో అడంగల్ సవరణ కోసం రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐని పట్టుకునేందుకు అనిశా.. తహసీల్దార్ కార్యాలయం పై దాడులు నిర్వహించారు. నంబుపూలకుంట మండలానికి చెందిన రైతు కొండారెడ్డి తన భూమి అడంగల్ సవరణ కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లగా ఆర్ఐ 3వేల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి అంగీకరించిన రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదట 1500 రూపాయలు అధికారికి ఇచ్చారు. అనిశా అధికారులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న ఆర్ఐ అక్కడి నుంచి పారిపోయారు. అధికారిని పట్టుకునేందుకు అనిశా అధికారులు, సిబ్బంది రాత్రి 11 గంటల వరకు రెవెన్యూ కార్యాలయ పరిసరాల్లోనే వేచి ఉన్నారు. రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారిని పట్టుకుని మీడియా ముందు ప్రవేశ పెడతామని అనిశా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: నటన నుంచి రాజకీయ నాయకుడిగా 'వారాలబ్బాయ్'