అనంతపురం జిల్లాలో బాలికకు అబార్షన్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంత గ్రామీణ ప్రాంతానికి చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమించాడు. ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు... అబార్షన్ చేయించుకుని వస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అమ్మాయి.. తల్లిదండ్రులకు విషయం చెప్పటంతో పట్టణంలోని ఓ ఆసుపత్రిలో గర్భం తీయించారు. అయితే సోమశేఖర్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
బాలికను మోసం చేసిన వ్యక్తిని, చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించిన.. చేసిన వారిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. లింగ నిర్ధరణ, అబార్షన్ చేస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక వ్యవహారంలో మొత్తం పది మందిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: విడపనకల్లులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు