అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం జాతీయ రహదారిపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కదిరి పట్టణానికి చెందిన మహబూబ్ బాషా స్థానిక జాతీయ రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి ... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మహబూబ్ బాషా బుద్ధిమాంద్యంతో పాటు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారకస్థితిలో పడివున్న మహబూబ్ బాషాను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఉంటాయని పోలీసులు తెలిపారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. క్వారంటైన్ కేంద్రంలో ఖాళీ లేదు... రోడ్డు మీదే రోగులు..!