అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన ఉప్పర చౌడప్ప అనే యువకుడు తన స్నేహితులతో కలిసి హేమావతి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లాడు. వల వేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో.. తోటి స్నేహితులు అతన్ని రక్షించే ప్రయత్నం చేసే లోపే మునిగిపోయాడు. మృతుని మిత్రులు పోలీసులకు సమాచారం అందించి గ్రామస్థుల సహాయంతో మృతిదేహాన్ని వెలికి తీశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండీ..అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య