ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. శ్రీనిత్య కుటుంబానికి ఆర్థికసహాయం - తనకల్లులో ఈటీవీ భారత్​ కథనానికి స్పందన

కంటిచూపు కావాలంటూ 'నిత్య' రోదన పేరుతో ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో కంటి చూపు కోల్పోయిన శ్రీనిత్య కుటుంబానికి నిత్య సురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఆర్థిక సహాయం చేశారు.

a trust response on etv bharat blind girl article at tanakallu
ఈటీవీ భారత్​ కథనానికి స్పందన
author img

By

Published : Nov 30, 2020, 7:54 PM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో కంటి చూపు కోల్పోయిన శ్రీనిత్య కుటుంబానికి ఓ ట్రస్టు సాయం చేసింది. ఈటీవీ భారత్​లో వచ్చిన కంటిచూపు కావాలంటూ 'నిత్య' రోదన కథనానికి, నిత్య సురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్​పర్సన్ నిర్మలమురళి స్పందించి...రూ.10 వేలతో పాటు నిత్యవసరుకులు అందించారు. చదువులో మంచి మార్కులతో రాణిస్తూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనలో.. తలనొప్పి రావడంతో చూపుని కోల్పోయిన చిన్నారికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. తమ వంతు బాధ్యతగా చిన్నారి తండ్రైన నాగేంద్రకు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించామన్నారు. సమాజంలో ఇలాంటి అంశాలను ప్రజలకు తెలుపుతున్న ఈనాడు, ఈటీవీ భారత్​కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి కృషి చేస్తామని ఆమె చెప్పారు.

ఇదీ చూడండి. కంటిచూపు కావాలంటూ 'నిత్య' రోదన ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.