ETV Bharat / state

ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్​తో రెచ్చిపోయిన దొంగ - ismart shankar

పోలీసుల ఎదుట ఇస్మార్ట్ శంకర్ సినిమా డైలాగులు చెబుతూ ఓ దొంగ కాసేపు హల్​చల్​ చేశాడు. కిటీకి అద్దాన్ని పగులగొట్టి గాజు ముక్కలతో ఒంటిపై పొడుచుకున్నాడు. అసభ్య పదజాలంతో పోలీసులకు చిరాకు పుట్టించాడు.

దొంగ హల్​చల్
author img

By

Published : Sep 30, 2019, 9:23 PM IST

ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్​తో రెచ్చిపోయిన దొంగ

అనంతపురంలో సెల్​ఫోన్ దొంగలు హల్​చల్ సృష్టించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​లో రాత్రివేళ ప్రయాణికుల ఫోన్లను దొంగలిస్తుండగా అక్కడివారు గమనించి ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. పట్టణ పోలీసులు వచ్చేంతవరకు ఔట్ పోస్ట్ సిబ్బంది వీరిని అక్కడే కొంతసేపు స్టేషన్​లో ఉంచారు. మద్యం మత్తులో ఉన్న ఓ దొంగ కాసేపు భీభత్సం సృష్టించాడు. "చంపుతారా? మీరు ఏమీ చేయలేరు, అమ్మా పోచమ్మ తల్లి, క్యా బోల్​ తీ" అంటూ ఇస్మార్ట్ శంకర్ సినిమా డైలాగులు చెప్పాడు. ఔట్ పోస్ట్ స్టేషన్​లోని ఫ్యాన్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశాడు. పక్కనే ఉన్న కిటీకీ అద్దాన్ని పగలగొట్టి గాజు ముక్కలతో ఇష్టానుసారంగా ఒంటిపైన పొడుచుకున్నాడు. మూడో పట్టణ పోలీసులు అర్ధరాత్రి వేళ అక్కడికి చేరుకొని నిందితులను పట్టుకున్నారు. వీరు కర్నూలు జిల్లాకు చెందిన దొంగలముఠాగా పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు మూడో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం శాంతినగర్ లో మున్సిపల్ అధికారులు ఇళ్ల తొలగింపుకు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అనుమతులు లేకుండా 60 అడుగుల రహదారిలో గృహాలను నిర్మించారని వాటిని తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ సంఘటనా స్థలానికి వచ్చి తెలిపారు ఈ దశలో ఆగ్రహించిన స్థానికులు ఇళ్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు భాజపా సిపిఐ సిపిఎం జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు భారీగా పోలీసులు మోహరించి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నిర్మాణాలు తొలగించకుండా మహిళలు బైటాయించారు మహిళలను అక్కడ నుంచి బలవంతంగా పోలీసులు లాక్కెళ్లారు మహిళా పోలీసుల స్థానంలో మగ పోలీసులు మహిళలను అక్కడ నుంచి తీసుకెళుతున్న పోలీసులపై తిరగబడ్డారు స్థానికులు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జెసిబి అద్దాలు పగిలాయి అక్కడ ఉన్న స్థానికులు పోలీసులు చెదరగొట్టారు

Body:ఇళ్ల తొలగింపును ఉద్రిక్తత

Conclusion:అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.