అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని హిరుతుర్పిలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. తీవ్ర రక్తస్రావమవ్వడంతో కుటుంబసభ్యులు బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాల కారణంగా నాగరాజు అనే వ్యక్తిపై తన బంధువు కొడవలితో దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కూతురు వివాహం తెచ్చిన తంటా.. భర్తను చంపిన భార్య