అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కంబదూరు చెక్ పోస్టు వద్ద హత్య కలకలం రేపింది. రవి అనే యువకుడు చెక్ పోస్ట్ సమీపంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. బండరాయితో మోది దారుణంగా హతమార్చినట్టు ఆనవాళ్లు చూస్తే తెలుస్తోంది. తెల్లవారు రవి మృతదేహాన్ని గమనించిన బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు