అనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందాడు. రోజూలానే ఉపాధి హామీ పనులకు వెళ్లిన జగన్నాథ్... గుండెపోటు రావటంతో అక్కడికక్కడే చనిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. కంబదూరు ఎంపీడీవో శివారెడ్డితో పాటు పలువురు మండల నాయకులు గ్రామానికి వెళ్లి జగన్నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పెద్దదిక్కు జగన్నాథం మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి రావాల్సిన సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి