అనంతపురం జిల్లా నార్పల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రామాంజనేయులు అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే మండలం కేంద్రంలోని పులసలనుతల రోడ్డులో విద్యుత్ లైన్‌కు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అవ్వడం వల్ల ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో కుడి చేయి పూర్తిగా కాలిపోయింది. వెంటనే క్షతగాత్రున్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: