Man Stuck up in Lift: అనంతపురం నగర సమీపంలో గుత్తిరోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ప్రమాదంలో శాంతరాజు (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. ప్రమాదంపై ఒకటో పట్టణ పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన శాంతరాజు రైతు. వ్యవసాయ పనులు లేని సమయాల్లో కూలీ పని కోసం జిల్లా కేంద్రానికి వచ్చేవాడు. ఈ క్రమంలో నగరంలోని గుత్తి రోడ్డులో కన్యకాపరమేశ్వరి నిలయం అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌పై భాగం తలకు తగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. గమనించిన యజమాని నాగశరత్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..
Cheating Baba: అన్నవరం సిద్ధాంతినంటూ హల్చల్.. పూజల పేరుతో డబ్బులు వసూలు