అనంతపురంలోని అట్టల గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. సాయంత్రం గోడౌన్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రాత్రి వరకు దాదాపు ఐదు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను ఆర్పారు. మద్యం బాటిళ్ల ప్యాకింగ్ కోసం త్రిపురరెడ్డి అనే నిర్వాహకుడు అట్టపెట్టెలని తీసుకెళ్లేవాడని స్థానికులు తెలిపారు. రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.
ఇదీ చూడండి. నేరస్థులైనా వారిదీ అమ్మమనసే కదా..!