చేనేత కార్మికుడు వెంకటేష్, హేమలత దంపతులకు ముగ్గురు సంతానం కాగా మూడో సంతానం మహేష్ బాబుకు మొదటి నుంచే యోగాసనాలపై మక్కువ. బిడ్డ ఇష్టాన్ని గమనించిన తండ్రి వెంకటేష్ శిక్షణ ఇప్పించేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఇంట్లోనే సాధన చేయించాడు. విద్యార్థి ఆసక్తిని పసిగట్టిన పాఠశాల పీడీ రమేష్.. మహేష్‌తో యోగాసనాలు సాధన చేయిచాడు. అనతికాలంలోనే అతి కష్టమైన ఆసనాలు సైతం ఎంతో సులభంగా వేసి పలువురు అభినందనలు అందుకున్నాడు. నిద్రాసనం, భూమాసనం, చక్రాసనం, ధనురాసనం ఇలా పలురకాల ఆసనాలను అవలీలగా వేస్తున్నాడు. యోగాసనాల సాధనలో జాతీయస్థాయిలో రాణించడమే తన లక్ష్యమంటున్నాడు మహేష్. దాతలు లేదా ప్రభుత్వం సహకరించి తన కుమారుడి ఉన్నతికి పాటుపడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్న వయస్సులోనే కఠినమైన యోగాసనాలకు సులభంగా వేస్తూ.. శభాష్ మహేష్ అనిపించుకుంటున్న ఈ చిన్నారి కల సకారం కావాలని మనమూ కోరుకుద్దాం.
ఇవీ చూడండి...