అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో పోలీసులు ఓ వ్యక్తి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పట్టణానికి చెందిన ఓబులుపతి అనే వ్యక్తి గత కొంత కాలంగా కర్ణాటక లోని బళ్లారి నుంచి గంజాయిని తీసుకువచ్చి ఉరవకొండలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ముందస్తు సమాచారం అందిన మేరకు.. స్థానిక బైపాస్ రోడ్డు వద్ద ఓబులుపతి నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి: