కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న.. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బాగేపల్లికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తనకల్లులోని వివిధ గ్రామాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. అతడి వద్ద నుంచి 615 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. గద్దలబండ తండా, కొత్తకురువపల్లిలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: