ద్విచక్రవాహనాలపై అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కంబదూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో రెండు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 96 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్లను సీజ్ చేసినట్లు కళ్యాణదుర్గం ఎస్ఈబీ సీఐ హరికృష్ణ తెలిపారు. అలాగే తెనగల్లు గ్రామ సమీపంలో 144 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఈబీ సీఐ రవి తెలిపారు.
ఇదీ చదవండి :