అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం పోలీసులు జరిపిన దాడుల్లో 37 బాక్సుల కర్ణాటక మద్యం, 7 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఏపీలో రూ. 3.23 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో సరిహద్దు నియోజకవర్గాలైన రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో అక్రమార్కులు రాత్రివేళలో మద్యాన్ని అక్రమంగా రాష్ట్రానికి రవాణా చేస్తున్నారని అనంతపురం అదనపు ఎస్పీ రామ్మోహన్రావు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మద్యం రాకుండా సరిహద్దుల్లో బందోబస్తు పెంచుతామని చెప్పారు. ఈ ఘటనలో 17 మందిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి :