ETV Bharat / state

హలో పిల్లలూ.. ఈ పతంగుల కథ మీకూ తెలుసా..!

author img

By

Published : Jan 14, 2023, 7:00 AM IST

Story of Kites: సంక్రాంతి పండుగ సంబురం మొదలైంది. పట్టణాలు, మండలాలు, గ్రామాలన్నీ సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. పాఠశాలలకు, కళాశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో విద్యార్థులందరూ తమ తమ కుటుంబ పెద్దాలతో కలిసి పండుగను జరుపుకునేందుకు సిద్దమయ్యారు. మరోవైపు వృత్తి, వ్యాపారం నిమిత్తం నగరాల్లో స్థిరపడిన వాళ్లంతా పల్లెబాట పట్టారు. ఇక ఈ పండుగలో కనుమ రోజున గాలిపటాలు ఎగరవేయడమంటే పిల్లలకు ఎంతో సరదా. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పిల్లలంతా ఆరోజంతా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి పతంగులను ఎగరవేస్తుంటారు. అయితే, చాలా మందికి ఈ పతంగుల వెనక ఉన్న స్టోరీ ఏంటో తెలియదు. మరి ఈ పండుగకు ఆ పతంగుల స్టోరీ ఏంటో తెలుసుకుని వాటిని ఎగురవేసి ఆనందించండి.

పతంగుల కథ
Kite story

Story of Kites: హలో పిల్లలూ.. బాగున్నారా!.. నేను మీ గాలిపటాన్ని.. సంక్రాంతి సెలవులు వచ్చాయి కదా.. ఇక మీరు నాతో ఆడుకోవడానికి ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. అయితే, ఆడుకునే ముందు నా గురించి కొన్ని విషయాలు చెబుతాను. వింటారా..

నా పుట్టుక గురించి.. ఐదు వేల ఏళ్ల క్రితం రుగ్వేదలో ఉత్తరాయణ కాలంలో దేవున్ని గాఢ నిద్రలోంచి మేల్కొల్పేందుకు నన్ను ఎగురవేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నేను మన ఆసియా ఖండంలోని చైనాలో పుట్టానని మరికొందరు చెబుతుంటారు. ఏడో శతాబ్దంలో చైనాకు చెందిన హుయిన్‌ షాంగ్‌ బుద్దిస్ట్‌ మిషనరీల ద్వారా మన భారతదేశంలో అడుగిడినట్లు పేర్కొంటున్నారు. ఆ తర్వాత నన్ను ఒక సంప్రదాయ పండగగా చూస్తున్నారు. అందుకే ఉత్తరాయణ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నా పేరిట పండగలు, పోటీలు నిర్వహిస్తారు. ఇది ఒక సాంస్కృతిక కృత్యంగా జరుపుతారు.

గుజరాత్‌ వేదికగా కైట్‌ ఫెస్టివల్‌.. మన దేశంలోని అన్ని పట్టణాలు, పల్లెల్లో నాతో గడపడానికి ఆసక్తి చూపుతుంటారు. మన దేశంలో 1989లో గుజరాత్‌లోనే మొట్టమొదటి అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఆ రోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చి వారు విభిన్నమైన.. పెద్ద పెద్ద గాలిపటాలతో పోటీ పడుతుంటారు. ఏటా జనవరి 14న ఈ ఒక్క రాష్ట్రంలోనే 2 వేల వేదికలపై నుంచి ఎగురవేస్తారు. ఆ తర్వాత రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో కూడా పెద్ద ఎత్తున పండగ నిర్వహిస్తున్నారు. క్రమంగా దేశంలోని అన్ని పట్టణాలకూ విస్తరించాను. దశాబ్దం కిందట మన కరీంనగర్‌లో కూడా అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. చదువుల్లో ఉన్నతంగా రాణిస్తూనే.. తల్లిదండ్రులను..తోటి వారిని గౌరవిస్తూ ఈ సెలవు రోజుల్లో నాతో సరదాలు పంచుకుంటారని భావిస్తున్నా.

తస్మాత్‌ జాగ్రత్త.. రద్దీ ప్రాంతాల్లో.. జనసంచారం ఉన్న చోట ఎగురవేయొద్దు. దారం రోడ్డుకు అడ్డగా పడితే వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. పతంగి తెగి పడితే పైకి చూస్తూ.. దాని వెంట పరుగెత్తకూడదు.

  • కొందరు పిల్లలు, యువకులు మేడ పైభాగంలో నాతో ఆడుతుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడతారు. ఒకవేళ తప్పదు అనుకుంటే పెద్దల పర్యవేక్షణ ఉండేలా చూసుకోండి.
  • కరెంట్‌ తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. ఒకవేళ చెట్లకుగానీ, తీగలకుగానీ చిక్కితే తీసే సాహసం చేయొద్దు. ప్రమాదం జరిగే అవకాశముంటుంది.
  • ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం మన రాష్ట్రంలో చైనా మాంజా పతంగులను నిషేధించింది.
  • చైనా మాంజా పతంగులతో పక్షులు చనిపోతే 3-7 ఏళ్ల జైలుశిక్ష, లేదంటే రూ.10 వేల జరిమానా విధిస్తారు.
  • కొందరు గ్లాస్‌ కోటింగ్‌తో కూడిన నైలాన్‌, సింథటిక్‌ దారాన్ని వాడుతుంటారు. ఇదీ ప్రమాదకరమే. ఈ దారానికి పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి. వ్యక్తులు గాయపడుతున్నారు.
  • చైనా మాంజాకు బదులు సంప్రదాయ దారం వాడాలని పర్యావరణ వేత్తలు, అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
  • నిర్మానుష్య ప్రదేశాలు, ఆటస్థలాలు, తదితర అనువైన ప్రాంతాల్లో ఎగురవేయండి. ఆనందాన్ని పొందండి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.