ETV Bharat / state

'చలో నర్సీపట్నం'కు అడ్డంకులు.. నేతల గృహనిర్బంధాలు.. - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

CHALO NARSIPATNAM: అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతను నిరసిస్తూ.. తెలుగుదేశం శ్రేణులు 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చారు. అయ్యన్న కుటుంబానికి సంఘీభావంగా కొందరు తెలుగుదేశం నేతలు రాత్రంతా ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయ్యన్నపాత్రుడే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో నర్సీపట్నంను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడే తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు.

CHALO NARSIPATNAM
CHALO NARSIPATNAM
author img

By

Published : Jun 20, 2022, 11:05 AM IST

Updated : Jun 20, 2022, 3:36 PM IST

CHALO NARSIPATNAM: అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతను నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీతోపాటు మిగతా పార్టీలు హాజరయ్యే అవకాశం ఉండడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చిన తెదేపా.. పలుచోట్ల నేతల గృహనిర్బంధాలు

నర్సీపట్నం రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు. అనకాపల్లిలో తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావును గృహ నిర్బంధం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ కన్వీనర్ మళ్ల సురేంద్ర నర్సీపట్నం వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే అక్రమంగా నిర్బంధిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయ్యన్నపాత్రుడే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర తెదేపా నేతలు అయ్యన్న కుటుంబానికి అండగా నిలిచారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత కక్షపూరిత చర్యల్లో భాగమేనని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ధ్వజమెత్తారు.

విశాఖలో 'చలో నర్సీపట్నం'కు వెళ్లకుండా పోలీసుల పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మృణాళి ఇళ్ల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. పరవాడ మండలం వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు గృహనిర్బంధించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. 'చలో నర్సీపట్నం'కు వెళ్తుండగా విజయనగరంలో ఆయనను అడ్డుకున్నారు. 'చలో నర్సీపట్నం' అడ్డుకునేందుకు పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు గృహనిర్బంధించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 20, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.