ETV Bharat / state

డోలిలో గర్భిణీని మోసుకుంటూ.. 9 కిలోమీటర్లు నడిచి.. - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

Pregnant woman in doli: తరాలు మారాయి... ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ అనగారిన ప్రజల బతుకులు మాత్రం మారడంలేదు..! దగ్గొచ్చినా, జ్వరం వచ్చినా.. కిలో మీటర్ల మేర నడవాల్సిందే. ఆ నడిచే దారి కూడా సరిగా ఉండదు. ఆఖరికి మహిళలు ప్రసవం కోసమూ.. పురిటి నొప్పులను భరిస్తూ కిలో మీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లాల్సిందే. తాజాగా ఓ గర్భిణీకి ఇదే పరిస్థితి ఎదురైంది. పురిటినొప్పులతో ఉన్న మహిళను డోలిలో మోసుకుంటా 9 కి.మీ మేర నడిచి.. ఆస్పత్రికి చేర్చారు..!

Pregnant woman in doli
డోలిలో ఆస్పత్రికి గర్భిణీ
author img

By

Published : Jun 1, 2022, 1:16 PM IST

Pregnant woman in doli: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో గర్భిణీకి డోలి మోత తప్పలేదు. సుమారు 9 కిలో మీటర్ల దూరం వరకు డోలిలోనే మోసుకెళ్లాల్సి వచ్చింది. కొయ్యూరు మండలం ములపేట పంచాయితీ పరిధిలోని జాజులబంద గ్రామానికి చెందిన పాంగి శాంతికి నెలలు నిండటంతో గ్రామం నుంచి డోలి మోతతో.. దాదాపు 9 కిలో మీటర్లు నడిచి రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి తీసుకెళ్లారు. అనంతరం.. వైద్యుల సూచన మేరకు విశాఖ నగరలోని కేజీహెచ్​లో చేర్చారు. అక్కడ ఇవాళ తెల్లారుజామునే పండంటి పాపకు జన్మ నిచ్చింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా తమ తలరాతలు మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.