14 Feets King Cobra: ప్రపంచంలోనే అతి విషపూరితమైన కింగ్ కోబ్రా అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో కలకలం రేపింది. పామాయిల్ తోటలో కూలీలు గెలలు కోస్తుండగా వారికి కనిపించింది. భారీ పామును చూసిన కూలీలు భయభ్రాంతులతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్స్కు సమాచారం అందించారు. సభ్యులు వెంకటేష్, మూర్తి సంఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి.. కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు 14 అడుగుల వరకు ఉండొచ్చని తెలిపారు.
ఈ కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాము అని అన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం వీటిని రక్షించుకోవాలని వన్యప్రాణి సంరక్షణ సభ్యులు సూచించారు. ఓ సంచిలో బంధించిన కింగ్ కోబ్రాను వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: