ETV Bharat / state

లోటు బడ్జెట్​లోనూ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం - బీసీ ఉపకులాల అభ్యున్నతికి చర్యలు : లోకేశ్ - చంద్రబాబు

Lokesh Yuvagalam Padayatra in Anakapalli: నవ్యాంధ్రలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లాలో గవర సామాజిక వర్గీయులు, విశ్రాంత ఉద్యోగులతో ఆయన భేటీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని భేటీలో పలువురు లోకేశ్​ కు తెలిపారు.

Lokesh Yuvagalam Padayatra in Anakapalli

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 9:19 PM IST

Lokesh Yuvagalam Padayatra in Anakapalli: అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఎలమంచిలి కొత్తూరు క్యాంప్‌ సైట్‌ నుంచి 222వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అడ్డగోలుగా దోచుకోవడమే పనిగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని లోకేశ్ ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే బెదిరింపులు, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నవ్యాంధ్రలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగులను ముంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతందని లోకేశ్ మండిపడ్డారు.

బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌: ఎలమంచిలిలో విశ్రాంత ఉద్యోగులతో యువనేత సమావేశమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మొదటి బాధితులు ఉద్యోగులేనని లోకేశ్ చెప్పారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి నేడు ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డుపైకి నెట్టిందని విమర్శించారు. నవ్యాంధ్రలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని లోకేష్‌ చెప్పారు. రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగులను ముంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతందని లోకేశ్ మండిపడ్డారు.

దుగ్గిరాలలో యువరైతు ఆత్మహత్య - వైసీపీ సర్కార్‌ తీరుపై చంద్రబాబు, లోకేశ్ ధ్వజం

గవర సామాజిక వర్గీయులతో లోకేశ్: నారాయణపురంలో గవర సామాజిక వర్గీయులతో లోకేశ్ సమావేశమయ్యారు. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలనలో బీసీలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 26 వేల మంది బీసీలపై అక్రమంగా కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేదే వైసీపీ కుట్ర అని లోకేశ్‌ విమర్శించారు. అధికారంలోకి రాకముందు చాలా హామీలిచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

బీసీలకు ప్రత్యేక చట్టం - అందరికీ అండగా ఉంటాం : నారా లోకేశ్

ఒక్క పరిశ్రమ రాలేదు: వైసీపీ ప్రభుత్వాని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. అడ్డగోలుగా దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇసుక, మద్యం ఇలా ప్రతి దాంట్లో దోచుకుంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటుతున్నా, ఒక్క పరిశ్రమ రాలేదని పేర్కొన్నారు. ఉల్లిగడ్డకూ, బంగాలదుంపకు తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.

తిరుమలలో నిత్యాన్నదానంలో లోపించిన నాణ్యత - భక్తుల ఆగ్రహం, విరాళాల సొమ్ము ఏమైపోతోందని నారా లోకేశ్ నిలదీత

బీసీ ఉపకులాల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటాం: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.