ETV Bharat / state

అనకాపల్లి మెడలో పారిశ్రామిక హారం.. భారీగా పెరగనున్న ఉపాధి అవకాశాలు

Employment For Youth: జిల్లాల పునర్విభజన తర్వాత అనకాపల్లి జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలున్నాయి. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా విశాఖకు తలమానికంగా నిలిచిన ఫార్మా కంపెనీలు ఇప్పుడు కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వనరులతో  జిల్లా అభివృద్ది రూపురేఖలు మారనున్నాయి. కొత్తగా వచ్చే పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా దక్కనున్నాయి.

Employment For Youth
జిల్లా మెడలో పారిశ్రామిక హారం.. భారీగా పెరగనున్న ఉపాధి అవకాశాలు
author img

By

Published : Apr 8, 2022, 12:08 PM IST

Updated : Apr 8, 2022, 3:30 PM IST

Employment For Youth: అచ్యుతాపురం, పరవాడ, మాకవరపాలెం, పాయకరావుపేట, అచ్యుతాపురం సెజ్‌ కేంద్రాలతోపాటు రాంబిల్లి మండలంలో నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ నావికాస్థావరం, బాబా అణువిద్యుత్తు పరిశోధన స్థానం నిర్మాణంతో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. పాయకరావుపేట మండలంలోని డెక్కన్‌ కెమికల్స్‌ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కార్యరూపంలోకి వస్తే సుమారు రూ.లక్ష నుంచి 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉందని పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.

జిల్లాల పునర్విభజన తర్వాత అనకాపల్లి జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలున్నాయి. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా విశాఖకు తలమానికంగా నిలిచిన ఫార్మా కంపెనీలు ఇప్పుడు కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వనరులతో జిల్లా అభివృద్ది రూపురేఖలు మారనున్నాయి. కొత్తగా వచ్చే పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా దక్కనున్నాయి.

ఇప్పటివరకు బెల్లానికి పేరుగాంచిన అనకాపల్లి ఇకపై అంతర్జాతీయ పరిశ్రమలతో పారిశ్రామిక రంగంలో ముద్ర వేయబోతుంది. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలిలో 180 పరిశ్రమలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. బ్రాండిక్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌తో పాటు ల్యారస్‌ ల్యాబ్స్‌, అరబిందో, అభిజీత్‌, మైథాన్‌, ఫెర్రో పరిశ్రమలతో వేల మందికి ఉపాధి లభిస్తోంది. మొన్నటి వరకు విశాఖను ఆనుకుని ఉండే పరవాడ మండలంలోని ఫైజర్‌, మైలాన్‌, ఫార్మాజెల్‌, నాట్కో, హితాయి వంటి 80 ప్రసిద్ధ పరిశ్రమలు ఇప్పుడు అనకాపల్లి పరిధిలోకి వచ్చి చేరాయి. దీంతో పారిశ్రామిక జిల్లాగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి అవకాశం లభించింది.

22వేల మంది మహిళా ఉద్యోగులకు ఉపాధి అందిస్తున్న బ్రాండిక్స్‌ పరిశ్రమ

ప్రత్యేక ఆర్థిక మండలిలో ఖాళీగా ఉన్న 1500 ఎకరాలు, నాన్‌సెజ్‌లో ఎన్టీపీసీ నిర్మాణానికి సిద్ధం చేసిన 1200 ఎకరాల్లో మరిన్ని పరిశ్రమలు రావడానికి అవకాశాలున్నాయి. వీటితో పాటు నక్కపల్లిలో 3600 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయబోతున్నారు. రాంబిల్లిలో పారిశ్రామిక నోడ్‌ అభివృధ్ధికి నిధులు కేటాయించారు. మాకవరపాలెం మండలం రాచపల్లిలో అన్‌రాక్‌ పరిశ్రమలో కొన్ని యూనిట్లు ప్రారంభమయ్యాయి. వీటికి అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలను నెలకొల్పనున్నారు.

రోడ్ల విస్తరణ.. కాలుష్య నియంత్రణ: జిల్లా కేంద్రంగా ఉన్న అనకాపల్లిని కలుపుతూ ఉన్న చోడవరం, అచ్యుతాపురం, నర్సీపట్నం, తాళ్లపాలెం రోడ్లు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. పెరుగుతున్న పరిశ్రమలు, ఉద్యోగుల రాకపోకలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం ఉండాలి. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం సెజ్‌కు వెళ్లే దారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తే బ్రాండిక్స్‌ కంపెనీ మరో 30 వేల మందికి ఉపాధిని కల్పిస్తామని ఇదివరకు ప్రకటించింది కూడా. అలాగే ప్రస్తుతమున్న పరిశ్రమలతోపాటు బార్కు, ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రంతో కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. ఈ కాలుష్య నియంత్రణ పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజారోగ్యానికి ఇబ్బందేనని స్థానికులంటున్నారు.

ఇదీ చదవండి: Handicapped Pension: వాలంటీర్ల నిర్వాకం.. వికలాంగుల పింఛను ఇంటి పన్నుకు జమ

Last Updated : Apr 8, 2022, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.