ETV Bharat / state

హైదరాబాద్​లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు - నిర్మాణాలు నేలమట్టం - HYDRA DEMOLITIONS IN HYD

గచ్చిబౌలిలోని బఫర్​ జోన్​లోని నిర్మాణాలు నేలమట్టం - 10 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం

hydra_demolitions_in_hyd
hydra_demolitions_in_hyd (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 5:34 PM IST

Hydra Demolitions in Hyderabad: హైదరాబాద్​లో గచ్చిబౌలిలోని ఖాజాగూడ భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. చెరువు ఎఫ్టీఎల్‌, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చేశారు. ఖాజాగూడ సర్వే నంబరు 18 ఎఫ్​టీఎల్‌, బఫర్‌జోన్‌లో 9 ఎకరాల 7 గుంటల్లో అక్రమ నిర్మాణాలు నిర్మించారు. 2 చెరువుల ఆక్రమణలు తొలగించి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించి 20కి పైగా దుకాణాలను అధికారులు తొలగించారు.

కూల్చివేతల నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలు కూల్చేయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎలా ఖాళీ చేయాలంటూ వాపోయారు. భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. నోటీసులు ఇచ్చాక కూల్చివేతలు జరిపినట్లు స్పష్టం చేసింది. ఆ రెండు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా 10 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ వెల్లడించారు.

క్రెడిట్‌ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? - ఈ విషయాలపై అవగాహన తప్పనిసరి!

గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బఫర్‌జోన్‌లు తెలుసుకునే అవకాశం ఇస్తాం:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.