ETV Bharat / state

Son fulfilled his mothers wish: 56 ఏళ్ల తర్వాత పుట్టింటికి .. తల్లి కోరికను తీర్చిన తనయుడు - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

Son fulfilled his mothers wish: 56 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరింది ఓ వృద్ధురాలు. తనవారిని చూడాలన్న కోరికను తన కుమారుడు నెరవేర్చాడు. 56 ఏళ్ల తర్వాత పుట్టింటి వారిని చూసిన ఆమె ఆనందానికి అవదుల్లేవు. ఆమెను చూసిన పుట్టింటి వారు ఎలా స్వాగతించారంటే..?

Son fulfilled his mothers wish
56 ఏళ్ల తర్వాత పుట్టింటికి
author img

By

Published : Sep 20, 2022, 10:17 AM IST

Son fulfilled his mothers wish: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎం.గౌరీపార్వతి యుక్త వయసులో ప్రేమించిన వ్యక్తితో రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. 56ఏళ్ల కిందట పుట్టింటి వారికి దూరంగా వెళ్లిన ఆమె వయసు ఇప్పుడు 72ఏళ్లు. తన వాళ్లందరినీ చూడాలని ఉందని కుమారుడు షణ్ముక్‌రాజ్‌తో కొన్నాళ్ల క్రితం చెప్పారామె. తల్లి కోరిక తీర్చేందుకు ఇటీవల నర్సీపట్నం వచ్చిన అతడు బంధువులను కలిశారు. తన వాళ్ల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో వివరించారు. దీంతో పుట్టింటి వారంతా తమిళనాడు వెళ్లి గౌరీపార్వతిని చూసి వచ్చారు. 4 రోజుల కిందట గౌరీపార్వతి తన కుటుంబంతో కలిసి నర్సీపట్నంలోని పుట్టింటికి వచ్చారు. ఆమె రాకను బంధుమిత్రులంతా ఆనందంతో స్వాగతించారు. చిన్ననాటి ముచ్చట్ల నుంచి ఇన్నేళ్ల అనుభవాలను పంచుకుంటున్నారు. తమిళనాడులోని ఎట్టాయపురం ప్రాంతానికి చెందిన నమ్మళ్వార్‌ ఆరు దశాబ్దాల కిందట నర్సీపట్నం ప్రాంతానికి విద్యుత్తు పనుల కోసం రాగా.. గౌరీపార్వతి పరిచయమై ప్రేమగా మారింది. వీరి వివాహానికి అప్పట్లో కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తమిళనాడు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.