ETV Bharat / state

రోడ్డులేక.. వైద్యం అందక.. డోలీలో మృతదేహాలు.. అడవిబిడ్డల అరణ్య రోదన

ఏజెన్సీలోని పచ్చని పల్లెలను చూసి అందరూ మురిసిపోతారు. వాటి మధ్య జీవించాలని కోరుకుంటారు. కానీ ఆ జీవనం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి అక్కడివారి బతుకులను చూస్తే, అనుభవిస్తే తెలుస్తుంది. వ్యాధులబారినా పడి వైద్యం ఉండదు. రోడ్లు ఉండవు. మైళ్ల దూరం నడిస్తేగానీ వైద్యం అందదు. ఆలోపు ప్రాణం గాలిలో దీపంలాంటిది. ఎంత సాంకేతిక అభివృద్ధి చెందుతున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో జీవన స్థితిగతులు మాత్రం మారడంలేదు. తాజాగా మన్యంలో రెండురోజుల్లో వైద్యం అందక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చివరికి వారి మృతదేహాలను సైతం డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి. అసలేం జరిగిందంటే..?

Doli
డోలీలో మృతదేహాలు మోసుకెళ్లిన స్థానికులు
author img

By

Published : Oct 15, 2022, 5:04 PM IST

Updated : Oct 15, 2022, 5:22 PM IST

డోలీలో మృతదేహాలు మోసుకెళ్లిన స్థానికులు

అల్లూరి సీతాారామ జిల్లా మన్యంలో కొండ కోనల నుంచి మంచానపడ్డ గిరిజనులను ఆసుపత్రులకు తరలించాలంటే అరణ్య రోదనే. కొండలు, లోయలను దాటుకొని అటవీ మార్గం మీదుగా డోలీ కట్టుకొని నడుస్తూ గిరిజనులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రోగులను ఆసుపత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆసుపత్రికి తరలించే సరికి ఆలస్యం అవుతుండటంతో బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

తాజాగా సకాలంలో వైద్యం అందక రెండురోజుల్లో ఇద్దరు మృతిచెందారు. బాధితులను డోలీలో తీసుకొచ్చిన వారు.. ఆ తర్వాత మృతదేహాలను కూడా అదే డోలీలో తరలించడం అక్కడి పరిస్థితులకు అద్దపడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ రాచకిలం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తామర్ల రాజబాబు అనే గిరిజనుడ్ని గ్రామస్థులు, బంధువులు డోలి కట్టి 12 కిలోమీటర్లు అటవీ మార్గం ద్వారా చింతపాక మోసుకొచ్చారు. అక్కడ నుంచి ప్రైవేట్ ఆటోలో దేవరపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన గంటలోనే రాజబాబు మృతిచెందాడు.

మృతదేహాన్ని అంబులెన్స్‌లో చింతపాక తీసుకువచ్చి అక్కడ నుంచి తిరిగి డోలీ కట్టుకొని తిరుగుముఖం పట్టారు. రాములమ్మ అనే మహిళకు కూడా ఇదే పరిస్థితి ఎదురై మృతిచెందింది. గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో విషాదంలో మునిగిపోయారు. ఎంతకాలం ఈ కొండల్లో డోలీల మూత అంటూ గిరిజనలు ప్రశ్నిస్తున్నారు. రహదారి నిర్మించాలంటూ వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 15, 2022, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.