ETV Bharat / state

హైడ్రోవర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​.. వ్యతిరేకిస్తూ గిరిజనుల నిరసనలు - Protest against project hydropower project

Alluri Sitaramaraju District: అదానీ కంపెనీకి గిరిజన ప్రాంతాన్ని ధారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు గిరిజనులు ఆందోళన పథంలోకి అడుగుపెట్టారు. తమను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం అదానీ కంపెనీకి హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరిట అనుమతులు జారీ చేయటం అన్యాయమని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Alluri Sitaramaraju District:
Alluri Sitaramaraju District:
author img

By

Published : Feb 6, 2023, 8:32 AM IST

హైడ్రోవర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్

Alluri Sitaramaraju District: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం, పెద్దకోట పంచాయతీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వల్ల సుమారు 17 గ్రామాలు నష్టపోతాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

17 గ్రామాల పరిధిలో సుమారు 9వేల మంది గిరిజనులు నిర్వాసితులుగా మారుతారని, ఎనిమిది వేల ఎకరాల పంట భూములకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని వాపోతున్నారు. తమ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు సీపీఎం, తెలుగుదేశం తదితర అఖిలపక్షాలతో కలిసి పోరాటానికి గిరిజనులు సిద్ధమవుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరిట గిరిజన చట్టాలను తుంగలోకి తొక్కి కార్పొరేట్ సంస్థలకు తమ భూములను అప్పగించడాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు.

ఈ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వల్ల సాగు, తాగునీరు కలుషితం అవుతుందని, పంటలు పండక పొలాలు బీడుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవి నుంచి సేకరించిన ఉత్పత్తులతో తమ జీవనం కొనసాగుతుందని, అడవులను నాశనం చేసి తమను వెళ్లగొడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి హైడ్రో పవర్‌ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.