Mirror Writing : జీవితమంటే రొటీన్ గా సాగిపోవడమేనా ? మనకంటూ సమాజంలో గుర్తింపు ఉండక్కర్లేదా? అలా గుర్తింపు రావాలంటే ఏదో రంగంలో రాణింపు ఉండాలి. అందరిలా కాకుండా వైవిధ్యంగా రాణించాలి. అప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామానికి చెందిన మామిడి రమ్య అదే విధానాన్ని అనుసరించింది. అనేక అవార్డులను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్దామా!
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదవలస కి చెందిన రమ్య మిర్రర్ రైటింగ్‌లో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గుజరాతి, తమిళ్, మలయాళీ, నేపాలి భాషలను మిర్రర్ రైటింగ్ రాయగలని రమ్య తెలియజేసింది. 90 సెకన్లలో వందేమాతరం గీతాన్ని, రెండు నిమిషాల్లో 250 ఇంగ్లీషు అక్షరాలు రాసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించానని తెలిపారు.
ఇవీ చదవండి: