ETV Bharat / state

గిరిజనుల అభిప్రాయాలు సేకరించకుండానే.. రంగంలోకి సర్వే బృందాలు - పీఎస్‌పీ

Hydro bomb in Manyam: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తూర్పు కనుమల్లోని గిరిజనులను కలవరపెడుతున్నాయి. ప్రతి సభలో నా ఎస్సీలు, నా ఎస్టీలంటూ ప్రేమ ఒలకబోసే సీఎం.. ఆయా వర్గాల హక్కులు, చట్టాలను కాలరాసేలా నిర్ణయాలు  తీసుకుంటున్నారు. గిరిజనుల అభిప్రాయాలు సేకరించకుండానే ముందుకు వెళ్తున్నారు. హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 18, 2023, 9:58 AM IST

Hydro bomb in Manyam: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తూర్పు కనుమల్లోని గిరిజనులను కలవరపెడుతున్నాయి. ప్రతి సభలో నా ఎస్సీలు, నా ఎస్టీలంటూ ప్రేమ ఒలకబోసే సీఎం.. ఆయా వర్గాల హక్కులు, చట్టాలను కాలరాసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామసభల అనుమతి లేకుండా గూడేల గుండెలపై హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇలానే వదిలేస్తే మన్యం కాస్త గిరిజనేతరుల గుప్పిట్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల (పీఎస్‌పీ) ఏర్పాటు విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతోంది. ఇక్కడి ఐదో షెడ్యూల్‌ (గిరిజనేతరులకు భూ బదలాయింపునకు వీల్లేని) ప్రాంతంలో స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కొయ్యూరు మండలం ఎర్రవరం, అనంతగిరి మండలం పెదకోట, రైవాడలో ప్రాజెక్టుల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతానికి 3 ప్రాజెక్టులను కార్యరూపంలోకి తెస్తున్నా.. తర్వాత దశలో మరికొన్నిచోట్ల ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చి..: కొయ్యూరు మండలం ఎర్రవరంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్‌పీ ఏర్పాటుకు కడప జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు అనుమతులిచ్చారు. నోడల్‌ ఏజెన్సీగా నెడ్‌క్యాప్‌ను పెట్టారు. కొయ్యూరు పైనున్న కొండల నుంచి మైదాన ప్రాంతంలో తాండవ రిజర్వాయరు వరకు ప్రవహించే నీటి వనరుపై ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. రెండు చోట్లా 0.47 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించనున్నారు. దీనికోసం జల వనరులశాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉంది. జిల్లా అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈఎన్‌సీ కార్యాలయం నుంచి ఎన్వోసీని కంపెనీ తెచ్చుకున్నట్లు తెలిసింది. దీనిపై గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా కొత్తగా అనంతగిరి మండలంలోని పెదకోట, రైవాడ ప్రాంతాల్లోనూ అదానీ కంపెనీ నిర్మించబోయే పీఎస్‌పీల కోసం నీటి లభ్యత సామర్థ్యంపై సర్వే మొదలైంది. ఎర్రవరం మాదిరిగానే ఇక్కడా పరిశీలన చేపట్టకుండానే నివేదిక తెచ్చుకునే అవకాశం లేకపోలేదని సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మన్యం మెడపై కత్తి..: * ప్రస్తుతానికి ఎర్రవరం, పెదకోట ప్రాంతాలే కాకుండా అనంతగిరి మండలంలో మరో 2 చోట్ల పీఎస్‌పీలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గుమ్మకోటకు సమీపంలోని గుజ్జిలిలో 1400 మెగావాట్లు, బొర్రా గుహలకు సమీపంలోని చిట్టెమ్మవలసలో 800 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి.

* ఎర్రవరం ప్రాజెక్టువల్ల తాండవ జలాశయంపై ఆధారపడ్డ 4వేల ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకం కానుంది. జలాశయానికి ఎగువ నుంచి వచ్చే నీటి వనరుపైనే పంప్డ్‌ స్టోరేజి నిర్మిస్తున్నారు.

* రైవాడ జలాశయం ఎగువ భాగంలో పీఎస్‌పీ ఏర్పాటు చేస్తే.. విశాఖ నగర తాగునీటి అవసరాలపై ప్రభావం చూపనుంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.