ETV Bharat / state

బాలిక అనుమానాస్పద మృతి - పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం - crime news

Girl Suspicious Death: పన్నెండేళ్ల ఆదివాసీ బాలిక అనుమానాస్పద మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. బాలికను అత్యాచారం, హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Girl_Suspicious_death
Girl_Suspicious_death
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 10:28 PM IST

Girl Suspicious Death: పనుల కోసం పొలానికి వెళ్లి వచ్చిన ఆ తల్లిదండ్రులకు కుమార్తె విగతజీవిగా కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కానీ విషయం బయటకు రాకుండా గ్రామంలో పంచాయితీ నిర్వహించి, బాలికను పూడ్చిపెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆలస్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అల్లూరి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. అభంశుభం తెలియని 12 ఏళ్ల అమాయక ఆదివాసీ బాలిక అనునూనాప్పద స్థితిలో మరణించింది. అత్యాచారం, ఆపై హత్య జరిగినట్టు స్థానికంగా ప్రచారం జరుగు తుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ ఘటన ఈనెల 2వ తేదీన జరగగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక మరో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈనెల 2వ తేదీన ఉదయం ఆమె ఇంటిలో ఉంది.

కుమార్తెను చంపిన తల్లి - సహకరించిన అమ్మమ్మ

ఆ సమయంలో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారంతా ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో పొలం పనుల నుంచి బాధిత బాలిక తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారు. పని ముగించుకుని వచ్చిన తల్లిదండ్రులకు తమ కుమార్తె ఇంటిలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది.

అప్పటికే ఆమె మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలిక మృతి విషయాన్ని గ్రామస్థులంతా గోప్యంగా ఉంచారు. గ్రామంలోనే పంచాయితీ నిర్వహించి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని దూరంగా కొండ దిగువన ఓ పెట్టెలో పెట్టి పూడ్చి పెట్టారు.

క్రికెట్ ఆటలో వివాదం - బాలుడిని కొట్టి చంపిన మరో బాలుడు

అయితే ఈ విషయంపై పోలీసులకు సమాచారం తెలిసింది. బాధిత బాలిక తల్లిదండ్రులు సైతం తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని అలస్యంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, గూడెంకొత్తవీధి, సీఐ అశోక్ కుమార్, ఎస్సై అప్పలసూరి మారుమూల గ్రామానికి బందోబస్తుతో చేరుకున్నారు. తహసీల్దారు ప్రసాద్ ఆధ్వర్యంలో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు.

రెవెన్యూ అదికారుల సమక్షంలో శవ పంచనామా పూర్తి చేశారు. చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి ప్రశూతి వైద్య నిపుణురాలు డాక్టర్ సుధాశారద ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. అసలు అత్యాచారం జరిగిందా లేదా? అత్యాచారం జరిగితే దాని తరువాత హత్య చేశారా? లేక అత్యాచారం తరువాత బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న వివరాలు పోస్టుమార్థం నివేదిక తరువాతే తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్​ శివకిషోర్ తెలిపారు.

'మీ అమ్మను చంపేశా' - కర్నూలు లాడ్జి ఘటనలో కీలక మలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.