ETV Bharat / state

'విద్యుత్​ సబ్సిడీ తొలగించడమే కాకుండా.. రూ.12 వేలు కట్టాలనడం దారుణం' - అల్లివరం గ్రామానికి పవర్​ కట్​

CHANDRABABU ON POWER CUT: అల్లూరి జిల్లా అల్లివరం గ్రామానికి విద్యుత్​ నిలిపివేతపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ తొలగించడమే కాకుండా.. రూ.12 వేలు బిల్లు కట్టాలనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CHANDRABABU ON POWER CUT
CHANDRABABU ON POWER CUT
author img

By

Published : Nov 25, 2022, 3:45 PM IST

CBN ON POWER CUT IN ALLIVARAM : అల్లూరి జిల్లా అల్లివరం గిరిజన గ్రామానికి విద్యుత్‌ నిలిపివేతపై ఈటీవీ భారత్ ప్రచురించిన ​కథనంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. నిలిపివేసిన విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ తొలగించడమే కాకుండా.. రూ.12 వేలు బిల్లు కట్టాలనడం దుర్మార్గం అని మండిపడ్డారు. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

  • అల్లూరి జిల్లా పాడేరు మండలంలో అల్లివరం అనే గిరిజన గ్రామానికి నిలిపివేసిన విద్యుత్ సరఫరా పునరుద్దరించాలి. గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ తొలగించడమే కాకుండా...రూ.12000 బిల్లు కట్టాలి అనడం అసమంజసం. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను. pic.twitter.com/qICPHcGNRX

    — N Chandrababu Naidu (@ncbn) November 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

No Power in Allivaram: ఏజెన్సీలోని ఆదివాసీ, గిరిజన తెగలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వాగ్ధానంతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని అడవిబిడ్డలు సంబరపడ్డారు. ఐదేళ్లుగా సర్కార్ అందిస్తున్న సబ్సిడీతోనే కరెంటు సౌకర్యం పొందారు. ఉన్నట్లుండి మన్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు షాక్‌ అయ్యారు. ఏం జరిగిందో తెలియక తల పట్టుకున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే... వారిచ్చిన సమాధానం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం అల్లివరం అంధకారంలో మగ్గుతోంది. ఐటీడీఎ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండ పైభాగాన ఈ గ్రామం ఉంది. ఇక్కడ 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. రహదారి లేకపోవడంతో ఘాట్ రోడ్డులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గిరిజనుల వెతలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు... చీకట్లోనే అతి కష్టమ్మీద ఈటీవీ ప్రతినిధి అక్కడికి వెళ్లారు. గిరిబిడ్డలు తమ బాధలన్నీ ఈటీవీతో పంచుకున్నారు. కరెంట్ లేక చీకట్లోనే పనులు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి మళ్లీ తమ బతుకులను ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో... వేల రూపాయల పాత బిల్లులు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్ను ఫోన్లో సంప్రదించగా సచివాలయ నిబంధనల ప్రకారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు భూమి ఎక్కువగా ఉన్న కార్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న విద్యుత్ సబ్సిడీ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఇవేమీ లేనట్లయితే సచివాలయానికి రేషన్ ఆధార్ క్యాస్ట్ సర్టిఫికెట్ కాపీలిచ్చి విద్యుత్ పునరుద్ధరించుకోవాలని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా తాము ఏఈ సంప్రదించగా తప్పనిసరిగా కట్టాలంటూ చెబుతున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి అధిక మొత్తం తమపై భారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.