ETV Bharat / state

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఒకే ప్రాంతంలో రెండు గంటల్లో ఆరుచోట్ల చోరీ - AP latest news

Chain Snatching in Hyderabad : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జంటనగరాల్లో గొలుసు దొంగల ముఠా రెచ్చిపోయింది. రెండు గంటల వ్యవధిలో ఆరు చోట్ల మహిళల మెడల్లోంచి ఆగంతకుల ముఠా బంగారు గొలుసులు తెంచుకుపోయింది. ఒకే రోజు ఆరుచోట్ల చోరీలు జరిగాయి. చైన్ స్నాచింగ్ చేస్తున్న దృశ్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chain Snatching
చైన్ స్నాచింగ్
author img

By

Published : Jan 7, 2023, 1:05 PM IST

Chain Snatching in Hyderabad : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జంటనగరాల్లో గొలుసు దొంగల ముఠా రెచ్చిపోయింది. రెండు గంటల వ్యవధిలో ఆరు చోట్ల మహిళల మెడల్లోంచి ఆగంతకుల ముఠా బంగారు గొలుసులు తెంచుకుపోయింది. ఈ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి మొదలుకొని ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉప్పల్‌, కల్యాణపురి, నాచారం నాగేంద్రనగర్‌, ఓయూలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రామ్‌గోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లోని దుండగులు మహిళల మెడల్లోంచి గొలుసులు దొంగిలించారు.

చైన్ స్నాచింగ్ చేస్తున్న దృశ్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్‌కు ఉపయోగించిన బైక్‌ను దుండగులు సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ద్విచక్రవాహనం ఎవరి పేరు పైన రిజిస్టర్ అయిందనే విషయంపై ఆరా తీయగా.. ఆ బైక్‌ కొంతకాలం కిందటే చోరీ అయినట్లు కేసు నమోదైందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

దిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి... సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేట్‌ వరకు వరుసగా ఆరు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు రైల్వేస్టేషన్లు వద్ద నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలు చేపట్టారు. దొంగల ముఠా రైలులో దిల్లీ పారిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుల గురించి సమాచారం అందించాలని కోరుతున్నారు.

హైదరాబాద్​లో రెచ్చిపోయిన గొలుసు దొంగలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.