People Facing Problems for Bad Rods : అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట నుంచి కామయ్యపేట మీదుగా ఒడిస్సా వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఈ రోడ్డులో ఎటు చూసినా గోతులే కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి ఆ గోతుల్లోకి నీరు చేరి నిలిచిపోవడంతో.. మరీ అధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు.. మరోమార్గం లేక భయంభయంగా ఈదారిలోనే వెళ్తున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆటోవాలాలు నరకం అనుభవిస్తున్నారు. గర్భిణీలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
ఈ రహదారి గుండా నిత్యం వందలాది మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారు. గిరిజనులు పనుల నిమిత్తం బయటకు వెళ్లలంటే ఇదొక్కటే మార్గం. ఈ మార్గంలో గోతులు చెరువులను తలపిస్తున్నందు వల్ల.. కొండలపై నివసించే గిరిజనులకు ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తరలించాలంటే ఎన్నో అవస్థలు పడాల్సివస్తుంది.
Bad Roads in Alluri Seetharama Raju District : ఈ సమస్యపై ఎన్ని ఫిర్యాదులు చేసిన దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉందని వాహన చోదకులు వాపోతున్నారు. అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండలం తడిగిరి, తీగలవలస పంచాయితీలోని గ్రామాలతో పాటు.. డుంబ్రిగూడ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఒడిశాకు వెళ్లేందుకు ఈ రహదారే ప్రధాన మార్గం. అలాంటి రహదారి గోతుల మయమై వాహన చోదుకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గోతులు మరీ అస్తవ్యస్తంగా ఉంటూ.. రహదారి ఎంతుందో అంత పెద్ద మెుత్తంలో గోతులు విస్తరించి ప్రమాదకరంగా ఉన్నాయి. దిగుడు పుట్టు బుజ్జి వద్ద ఈ గోతులు మరింత ఎక్కువగా ఉండటం కారణంగా అక్కడ ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుతుంది.
Konaseema Roads: ప్రమాదకరం.. అడుగుకో గుంత.. గజానికో గొయ్యి .. ఎక్కడంటే..?
Road Condition in Alluri District : గోతులమయమైన రహదారులు, ప్రజల ఇక్కట్లు, మొరాయిస్తున్న వాహనాలు, ప్రజలు పడుతున్న బాధలపై ఎన్ని కథనాలు వచ్చినా స్పందన కరవైంది. వర్షాకాలం వస్తే ఆ రహదారులు చెరువులను తలపిస్తూ.. ప్రజలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇన్నీ ప్రమాదాలు జరుగుతున్నా కనీస మరమ్మతులు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నిసార్లు ఎంతమందిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు తమ ఆవేదన వెలిబుచ్చారు.
Condition of Roads in Parvathipuram Manyam District : ఇలాంటి అధ్వాన పరిస్థితి పార్వతీపురం జిల్లాలోను ఉంది. పార్వతీపురం నుంచి కొమరాడ మండలంలోని కూనేరు వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. ఎక్కడికక్కడే గుంతలు పడడంతో వర్షపునీరు చేరి, చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. ఇటుగా వచ్చే వాహనాల్లో వాటిల్లో కూరుకు పోతున్నాయి. ఈ క్రమంలో గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
సమస్యను పట్టించుకోలేదని.. రహదారిపైనే వరి నాట్లు
ఈ రోడ్డులోని ఓ భారీ గుంతలో లారీ ఉండిపోవడంతో కిలోమీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్సై జగదీశ్‌నాయుడు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వాహనాన్ని కొంతమేర పక్కకు నెట్టి చిన్న వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నాలుగు చక్రాలున్నవాటిని విక్రంపురం, డంగభద్ర, జంఝావతి కూడలి మీదుగా కొమరాడ వైపునకు మళ్లించారు. అనంతరం పోలీసులే మరమ్మతుల కోసం రంగంలోకి దిగారు. ఎస్సై కొంత సొమ్ము ఇవ్వగా.. గోతుల్లో క్రషర్ డస్ట్ వేయించి యంత్రం సాయంతో పూడ్పించారు. అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇస్తున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు , స్థానికులు ఆరోపించారు.
Damage Roads in AP : నమ్మినా నమ్మకపోయినా ఈ రోడ్డు వేసింది.. 9 నెలల క్రితమే! ప్రయాణించారో.. అంతే!
ఇవేం రోడ్లు.. గోతులమయమై ప్రయాణికులకు నరకం
ROADS IN KURNOOL: 2 కిలోమీటర్లు.. 164 గుంతలు.. నరకప్రాయంగా ప్రయాణం