ACB traps P Gannavaram MPDO: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎంపీడీవో కె.ఆర్. విజయ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమె రోజు మాదిరిగానే ఆఫీసుకు వచ్చారు. అప్పటివరకు కార్యాలయం ప్రశాంతగానే ఉంది. ఉన్నట్లుండి ఏసీబీ అధికారులమంటూ కొందరు ఆమె ముందు నిల్చున్నారు. తీరా చూస్తే ఆమె చేతిలో ఉపసర్పంచ్ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. ఇంకేముంది రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఆమె పట్టుబడ్డారు. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను పంచాయతీకి కేటాయించాలంటే.. రూ.50 వేలు చెల్లించాలని ఉపసర్పంచ్‌తో ఆమె ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 6న రూ.10 వేలు చెల్లించగా.. మిగిలిన రూ.40 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఉప సర్పంచ్ విజయలక్ష్మి.. అనిశా అధికారులను ఆశ్రయించారు. కార్యాలయంలో రూ.40వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: