టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హకీ జట్టు ఘోర పరాజయం పాలైంది. 1-7 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. హాకీ ప్రపంచ నంబర్ వన్ టీమ్ అయిన ఆస్ట్రేలియా.. ఆరంభం నుంచే భారత్‌పై పైచేయి సాధించింది. ఆట పదో నిమిషంలోనే డానియల్ బీలే తొలి గోల్ సాధించాడు. జోషూవ బెల్డ్జ్(26'), ఆండ్రూ ఫ్లిన్ ఒగిల్వీ(23'), జెరెమీ హేవార్డ్(21'), బ్లాక్ గోవర్స్(40', 42'), టిమ్ బ్రాండ్(51') గోల్స్‌తో భారత్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆస్ట్రేలియా. ఫలితంగా ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
దిల్‌ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో గోల్ కొట్టడం వల్ల భారత్‌కు ఆ ఒక్క గోల్ అయినా దక్కింది.
ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2తో విజయం సాధించిన మన్‌ప్రీత్ సేన ఈ మ్యాచ్‌లో భంగపాటుకు గురైంది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది టీమ్ఇండియా.
ఇదీ చదవండి: రెజ్లింగ్‌లో ప్రియా మాలిక్‌కు స్వర్ణం