ETV Bharat / sports

Tokyo Olympics: సింధు, మేరీకోమ్ జోష్.. షూటింగ్​లో మళ్లీ నిరాశ

ఆదివారం జరిగిన ఒలింపిక్స్​ పోటీల్లో షట్లర్ పీవీ సింధు, టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్ మనికా బత్రా మెరిశారు. బాక్సింగ్​లో మేరీ కోమ్​ ప్రిక్వార్టర్స్​కు వెళ్లింది. మరోవైపు సానియా మీర్జా, షూటర్లు ఓటమిపాలై నిరాశపరిచారు.

OLYMPICS INDIA RESULTS LATEST
ఒలింపిక్స్
author img

By

Published : Jul 25, 2021, 2:24 PM IST

Updated : Jul 25, 2021, 5:38 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో రెండో రోజు కూడా భారత్​కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పీవీ సింధు, మనికా బత్రా, రోయింగ్ జోడీ, బాక్సింగ్​లో మేరీ కోమ్​ ముందడుగు వేశారు.

జులై 25 ఫలితాలు

షూటింగ్​

ఆదివారం జరిగిన షూటింగ్ పోటీల్లోనూ భారత్​కు నిరాశ తప్పలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ విభాగంలో మను బాకర్, యశస్విని దేస్వాల్.. వరుసగా 12,13 స్థానాల్లో నిలిచారు. దీంతో కచ్చితంగా పతకం వస్తుందనుకున్న విభాగంలో నిరాశే ఎదురైంది.

అయితే పిస్టల్​లో సాంకేతిక లోపం వల్ల దాదాపు 20 నిమిషాల పాటు మను ఆట నిలిచిపోయింది. కాకింగ్ లెవల్​ బ్రేక్​డౌన్ కావడం వల్ల ఆమె గురితప్పింది. దీంతో ఫైనల్​లో చోటు దక్కక, నిరాశగా వెనుదిరిగింది.

shooting olympics news
భారత్ షూటర్

10 మీటర్ల ఎయిర్​ రైఫిల్ పురుషుల క్వాలిఫికేషన్​ రౌండ్​లో దీపక్ కుమార్(624.7), పన్వర్ దివ్యాంశ్ సింగ్(622.8).. 26,32 స్థానాల్లో నిలిచారు. ఫైనల్​కు అర్హత సాధించలేకపోయారు.

షూటింగ్ మెన్స్​ స్కీట్ క్వాలిఫికేషన్​ తొలిరోజు మూడురౌండ్లు పూర్తయ్యాయి. భారత షూటర్లు అంగద్ వీర్ సింగ్ బజ్వా 11వ, మిరాజ్ అహ్మద్ ఖాన్ 25వ స్థానాల్లో నిలిచారు. మిగతా రెండు రౌండ్లు సోమవారం(జులై 26) జరగనున్నాయి. టాప్​-6లో నిలిచినవారు ఫైనల్​కు వెళ్తారు.

బ్యాడ్మింటన్..

పతకమే లక్ష్యంగా బరిలో దిగిన స్టార్ షట్లర్​ పీవీ సింధు బోణీ కొట్టింది. బ్యాడ్మింటన్​ మహిళల సింగిల్స్​ మ్యాచ్​లో.. ఇజ్రాయెల్​కు చెందిన పోలికర్పోవాను వరుస సెట్లలో ఓడించింది. 21-7, 21-10 తేడాతో చిత్తు చేసింది.

PV SINDHU OLYMPICS
పీవీ సింధు

రోయింగ్​..

రోయింగ్​లో భారత రోయర్లు అరుణ్​ లాల్​, అర్వింద్​ సింగ్​ జంట అదరగొట్టింది. పురుషుల లైట్​వెయిట్​ డబుల్​ స్కల్స్​ రెపిచేజ్​ రౌండ్​లో టాప్​-3లో నిలిచి సెమీఫైనల్​ A/Bకు అర్హత సాధించింది. జులై 27న గెలిస్తే పతక అవకాశాలు మెరుగుపడతాయి.

ROWING OLYMPICS
రోయింగ్

జిమ్నాస్టిక్స్

ఒలింపిక్స్​లో మన దేశం తరఫున పాల్గొన్న ఏకైక జిమ్నాస్ట్ ప్రణిత నాయక్ క్వాలిఫికేషన్​ రౌండ్​లోనే ఓడింది. నాలుగు విభాగాల్లో కలిపి 42.565 స్కోరు చేసి 29వ స్థానంలో నిలవడం వల్ల ఈ విభాగంలో భారత్ కథ ముగిసింది.

టెన్నిస్

పతక ఆశలతో ఒలింపిక్స్​కు వచ్చిన సానియా మీర్జా.. మహిళల డబుల్స్​లో నిరాశపరిచింది. అంకితా రైనాతో కలిపి ఆడిన ఆమె.. తొలి రౌండ్​లో కిచునాక్ లియుద్​మ్యాలా- కిచునాక్ నదియా(ఉక్రెయిన్) జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో ఓడిపోయింది.

sania mirza olympics
సానియా మీర్జా

టేబుల్ టెన్నిస్

ఈ క్రీడలో భారత్​కు ఆదివారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల విభాగంలో పోటీపడిన జ్ఞానశేఖరన్ సత్యన్.. రెండో రౌండ్​లో హాంకాంగ్​ ప్లేయర్ లామ్​సియూపై 3-4 తేడాతో ఓడిపోయాడు.

మహిళా ప్లేయర్ మనికా బత్రా ప్రిక్వార్టర్స్​లో అడుగుపెట్టింది. వరల్డ్​ నెం.32 క్రీడాకారిణి మార్గరిటా పెసోట్‌స్కాపై రెండో రౌండ్‌లో 4-3 తేడాతో విజయం సాధించింది.

manika batra olympics
మనికా బత్రా

బాక్సింగ్

తొలి మ్యాచ్​లో బాక్సర్​ మేరీకోమ్ విజయం సాధించింది. తొలి రౌండ్​లో రిపబ్లిక్ ఆఫ్ డొమినిక్ క్రీడాకారిణి మిగ్యులినా హెర్నాండెజ్ గార్సియాపై 4-1 తేడాతో గెలిచింది. ప్రి క్వార్టర్స్​లో కొలంబియాకు చెందిన వాలన్సియా విక్టోరియాతో జులై 29న తలపడనుంది.

mary kom news
బాక్సర్ మేరీకోమ్

అయితే బాక్సింగ్​లో పురుషుల 63కేజీల విభాగం ప్రిలిమ్స్​ రౌండ్​ 32లో భారత్​కు నిరాశ తప్పలేదు. ప్రత్యర్థి లూక్​ మెక్​కార్నాక్​ చేతిలో మనీశ్​ కౌశిక్​ ఓటమిపాలయ్యాడు.​

హాకీలో..

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో భారత పురుషుల హాకీ జట్టు ఘోరంగా ఓడిపోయింది. 1-7తో ఓటమిపాలైంది.

స్విమ్మింగ్​లోనూ..

స్విమ్మింగ్​ 100మీటర్ల బ్యాక్​స్ట్రోక్​ హీట్స్​లో శ్రీహరి నటరాజ్​ నిరుత్సాహపరిచాడు. మొత్తం మీద 27వ స్థానంలో నిలిచిన నటరాజ్​.. సెమీఫైనల్​కు చేరుకోలేకపోయాడు.

అటు మరో స్విమ్మర్​ మానా పటేల్​ కూడా నిరాశకు గురిచేసింది. మహిళల 100 మీటర్ల బ్యాక్​స్ట్రోక్​ హీట్​ 1లో రెండో స్థానంలో నిలిచింది. ఇందుకు ఆమె 1 నిమిషం 5 సెకెండ్ల సమయం తీసుకుంది. దీంతో 100మీటర్ల మహిళల బ్యాక్​స్ట్రోక్​ ప్రీ-క్వార్టర్స్​లో చోటు దక్కించుకోలేకపోయింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 25, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.