ETV Bharat / sports

నమీబియాపై కివీస్​ ఘన విజయం- సెమీస్​ రేసులో ముందడుగు - టీ20 ప్రపంచకప్

నమీబియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్​. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో 52 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్​ రేసులో ముందడుగు వేసింది.

NZ vs Namibia
NZ vs Namibia
author img

By

Published : Nov 5, 2021, 6:58 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా జరిగిన మ్యాచ్​లో నమీబియాపై న్యూజిలాండ్​ ఘనవిజయం సాధించింది. కివీస్​ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో నమీబియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లు బార్డ్ (21)​, మైఖేల్ (25) 6 ఓవర్ల వరకు నిలకడగా బ్యాటింగ్​ చేసినా.. ఏడో ఓవర్​ నుంచి నమీబియా పూర్తిగా చతికిలపడిపోయింది. ఛేదనలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్​ బౌలర్లలో సౌతీ, బౌల్ట్​ రెండు చొప్పున వికెట్లు తీశారు. శాంట్నర్​, నీషమ్, సోధీ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో సెమీస్​ రేసులో మరింత ముందుకు వెళ్లింది కివీస్​. అఫ్గానిస్థాన్​ను వెనక్కు నెట్టి.. 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్​.. ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు గప్తిల్ (18), మిచెల్ (19) పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28) ఫర్వాలేదనిపించాడు. అయితే చివరి ఓవర్లలో ఫిలిప్స్ (39)​, నీషమ్ (35) మెరుపులతో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది కివీస్​. నమీబియా బౌలర్లలో బెర్నార్డ్​, వైస్, జెరార్డ్​ తలో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.