ETV Bharat / sports

Asia Badminton: క్వార్టర్​ ఫైనల్స్​కు సింధు, సాత్విక్​-చిరాగ్​ జోడీ - సింధు, సాత్విక్​-చిరాగ్​ జోడీ

Asia Badminton Championship Pv Sindhu: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీసింధు, సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి-చిరాగ్​ శెట్టి అదరగొట్టారు. గురువారం జరిగిన పోటీల్లో గెలిచి క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించారు.

PV sindhu
క్వార్టర్​ ఫైనల్స్​కు సింధు, సాత్విక్​-చిరాగ్​ జోడీ
author img

By

Published : Apr 28, 2022, 1:10 PM IST

Asia Badminton Championship Pv Sindhu: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీసింధు మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన పోటీల్లో గెలిచి క్వార్టర్​ ఫైనల్స్​కు దూసుకెళ్లింది.

మహిళల సింగిల్స్​లో సింగపూర్​కు చెందిన యు యన్​ జస్లిన్​(Yue Yann Jaslyn Hooi) 21-16, 21-16 తేడాతో ఓడించింది. ఈ పోరు 42 నిమిషాల పాటు సాగింది. క్వార్టర్స్​లో టోక్యో ఓలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన మూడో సీడ్​ హె బింగ్​తో(He Bing Jiao) తలపడనుంది.

ఇక డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి-చిరాగ్​ శెట్టి కూడా క్వార్టర్​ ఫైనల్స్​కు చేరారు. జపాన్​కు చెందిన అకిరా కోగా-తైచి సైతో(Akira Koga-Taichi Saito) ద్వయంపై 21-17 తేడాతో గెలిచారు. క్వార్టర్స్​లో ఐదో సీడ్​ అరోన్​ చియా-సో వూయ్​ ఇక్(మలేషియా) లేదా సింగపూర్​ ద్వయం డానీ బావా క్రిస్​నంట-జన్​ లియాంగ్​ యాండీతో తలపడనున్నారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​.. నాకు చాలా భయమేస్తోంది: హార్దిక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.