ETV Bharat / sports

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పరుగుల రాణి పీటీ ఉష!

పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్​ దాఖలు చేశారు.

PT Usha Indian Olympic Association president

author img

By

Published : Nov 27, 2022, 8:32 PM IST

Updated : Nov 27, 2022, 9:16 PM IST

భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్ష ఎన్నిక లాంఛనమైంది. పరుగుల రాణి పీటీ ఉషను ఈ అత్యున్నత పదవి వరించనుంది. డిసెంబర్​లో జరిగే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు. అధ్యక్ష పదవికి మరెవరూ నిమినేషన్​ వేయలేదు. దీంతో పీటీ ఉష ఎన్నిక దాదాపు ఖాయమైంది. అథ్లెటిక్స్​లో ఎన్నో పథకాలు సొంతం చేసుకున్న ఉష.. కీర్తి కిరీటంలో ఇది మరో మైలురాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆదివారం ఆఖరి తేదీ కాగా.. వివిధ పదవులకు మొత్తం 24 మంది నామినేషన్​ పత్రాలు సమర్పించారు. అందులో 12 మంది.. నాలుగు కార్యనిర్వాహక మండలి సభ్యుల స్థానాలకు పోటీపడ్డారు.

కాగా ఇండియన్ ఒలింపిక్​ అసోషియేషన్​లోని వివిధ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధ్యక్షుడు, సీనియర్ వైస్​ ప్రెసిడెంట్, రెండు వైస్​ ప్రెసిడెంట్ స్థానాలు(ఒకటి పురుషులకు, ఒకటి మహిళ), కోశాధికారి, రెండు జాయింట్​ సెక్రటరీ స్థానాలు(పురుషుడు, మహిళ), 6 కార్యనిర్వాహక మండలి సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఈ ఆరుగురిలో ఇద్దరు అథ్లెట్స్​ కమిషన్ ప్రతినిధులు ఉంటారు. ఇప్పటివరకు పీటీ ఉష వివిధ ఆసియా గేమ్స్​లో గోల్డ్​ మెడల్స్​ సాధించారు. 1984లో జరిగిన ఒలింపిక్స్​లో 400 మీటర్ల హర్డల్స్ ఈవెంట్​​ ఫైనల్​లో నాలుగో స్థానంలో నిలిచారు.

ఇవీ చదవండి : ఒకేసారి 101,566 మంది ప్రేక్షకులు.. నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్​ రికార్డ్!

సంజూ శాంసన్​ను జట్టులోకి తీసుకోలేదు.. కారణం ఇదే!

Last Updated : Nov 27, 2022, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.