ETV Bharat / sports

Neeraj Chopra Wins Gold : బల్లెం వీరుడు నీరజ్​ స్వర్ణ చరిత్ర.. ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో తొలి భారత అథ్లెట్​గా ఘనత - నీరజ్ చోప్రా మరో పసిడి

Neeraj Chopra Wins Gold World Athletics Championships 2023 : నాలుగు దశాబ్దాల ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్​షిప్​ చరిత్రలో ఏ భారత అథ్లెట్‌కు సాధ్యం కాని ఘనతను ఇప్పుడు స్టార్​ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సాధించాడు. ఇకపై ప్రపంచ అథ్లెటిక్స్‌లో మాకు ఒక ఛాంపియన్ ఉన్నాడు అని భారతీయులు సగర్వంగా చెప్పుకునేలా చేశాడు. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని అందుకున్న నీరజ్‌.. ఈ సారి పతక రంగును మార్చాడు. రజత ధీరుడు నుంచి పసిడి వీరుడిగా ఘనతను అందుకున్నాడు.

Neeraj Chopra Wins Gold : బల్లెం వీరుడు నీరజ్​ స్వర్ణ చరిత్ర..  ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో తొలి భారత అథ్లెట్​గా ఘనత

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 6:12 AM IST

Updated : Aug 28, 2023, 6:37 AM IST

Neeraj Chopra Wins Gold World Athletics Championships 2023 : భారత స్టార్​ జావెలిన్‌ త్రోయర్​ నీరాజ్‌ చోప్రా (Neeraj Chopra World Athletics) మరో రికార్డు సృష్టించాడు. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్​లో రజతం గెలిచిన నీరజ్‌ ఈ సారి ఇదే మెగాటోర్నీ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి.. స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి ఈ ఘనత సాధించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే జోరును ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ కొనసాగించి సత్తా చాటాడు.

Neeraj Chopra Gold Medal Throw Distance : క్వాలిఫయర్స్‌లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల దూరం బల్లెం విసిరి డైరెక్ట్​గా ఫైనల్​కు అర్హత సాధించాడు నీరజ్‌. అయితే ఈ తుది పోరు తొలి ప్రయత్నంలో అతడు విఫలమయ్యాడు. దీంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ అతడు రెండో ప్రయత్నంలో పుంజుకున్నాడు. బల్లెంను 88.17 మీటర్లు విసిరాడు. ఇక ఈ ప్రదర్శనతో అతడు 12 వ స్థానం నుంచి అగ్ర స్థానానికి దూసుకొచ్చాడు. ఆ తర్వాత ప్రయత్నాల్లోనూ 86.32, 84.64, 87.73, 83.98 మీటర్ల దూరం బల్లెం విసిరి అగ్రస్థానాన్ని కొనసాగించాడు. భారత అభిమానుల్లో పసిడి కాంతులను నింపాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఇక నీరజ్‌తో పాటు ఈ తుది పోరులో పోటీపడ్డ భారత అథ్లెట్స్‌ కిషోర్‌ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, డీపీ మను 84.14 మీటర్లతో ఆరోస్థానంలో నిలిచారు. పాక్‌ అథ్లెట్​ అర్షద్‌ నదీమ్‌ 87.82 మీటర్లు విసిరి సిల్వర్​ మెడల్​ను ముద్దాడగా.. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్‌ వడ్లెచ్‌ 86.67 మీటర్ల విసిరి కాంస్యం అందుకున్నాడు.

మరోవైపు పురుషుల 4X400 మీటర్ల రిలే విభాగంలో అమోజ్‌ జేకబ్, అనస్‌ యాహియా, రాజేశ్‌ రమేశ్, అజ్మల్​లతో కూడిన భారత జట్టు ఐదో స్థానంలో నిలిచింది. 2.59.92 సెకన్లతో రేసును ముగించింది. ఈ ఈవెంట్‌ను యూఎస్‌ఏ 2.57.31 సెకన్లలోనే పూర్తి చేసి గోల్డ్​ మెడల్​ను సాధించింది. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ విభాగంలో భారత్‌ తరఫున పోటీపడిన పరుల్‌ చౌదరీ 11వ స్థానంలో నిలిచింది. 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరింది. అయితే ఇందులో ఆమె పతకం గెలుచుకోకపోయినప్పటికీ.. జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పింది.

Neeraj Chopra Paris Olympics : నీరజ్ చోప్రా భళా.. పారిస్​ ఒలింపిక్స్​కు అర్హత

డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్‌ చోప్రా.. అగ్రస్థానం కైవసం

Last Updated : Aug 28, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.