ETV Bharat / sports

రెజ్లింగ్​లో భారత్​కు మూడు స్వర్ణాలు.. ఐదేళ్ల తర్వాత సాక్షికి మళ్లీ - ఒలింపిక్స్​ రెజ్లింగ్

ఒలింపిక్స్​ పతక విజేత,స్టార్​ రెజ్లర్​ సాక్షి మాలిక్​ మరోసారి స్వర్ణం సాధించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆమెను మళ్లీ గోల్డ్​ మెడల్​ వరించింది. సాక్షితో పాటు శుక్రవారం మరో ఇద్దరు రెజ్లర్లు స్వర్ణాలు సాధించారు.

d
d
author img

By

Published : Jun 3, 2022, 10:08 PM IST

రియో ఒలింపిక్స్​ పతక విజేత సాక్షి మాలిక్​ యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్​ సిరీస్​లో అదరగొట్టింది. కజకస్థాన్​లోని అల్మటీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బంగారు పతకాన్ని సాధించింది. మహిళల 62 కేజీ కేటగిరీలో కజకస్థాన్​కు చెందిన ఇరినా కుజ్నెట్సోవాపై 7-4 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో గత కొంతకాలంగా తడబడుతున్న సాక్షి తిరిగి ఫామ్​లోకి వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత సాక్షిని గోల్డ్​ మెడల్​ వరించింది. చివరసారిగా 2017లో జరిగిన కామన్​వెల్త్​ గేమ్స్​లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

రెజ్లింగ్​లో భారత్​కు మరో రెండు స్వర్ణాలు వచ్చాయి. 57 కిలోల కేటగిరీలో మాన్సి కజకస్థాన్​కు చెందిన ఎమ్మా టిస్సీనాపై 3-0తో విజయం సాధించగా.. 68 కేజీల కేటగిరీలో దివ్య స్వర్ణం దక్కించుకుంది. మంగోలియాకు చెందిన దెల్గెర్మా ఎన్ఖసయిఖాన్, కజకస్థాన్​కు చెందిన అల్బినాలపై గెలిచింది. కానీ ఫైనల్​ బౌట్​లో మంగోలియాకు చెందిన బొలోర్​టుంగలాగ్​ చేతిలో 10-14 తేడాతో ఓడిపోయింది. కానీ మొత్తంగా దివ్య ఖాతాలో ఎక్కువ విజయాలు ఉండటం వల్ల ఆమెను విజేతగా ప్రకటించారు. అంతకుముందు గురువారం జరిగిన మ్యాచ్​లో రెజ్లర్​ నీరజ్​ కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో మొత్తంగా భారత్​కు ఇప్పటివరకు నాలుగు పతకాలు దక్కాయి.

ఇదీ చూడండి: అక్కడ ఆడకపోతే ఇక్కడిదాకా వచ్చేవాడిని కాదు: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.