Commonwealth games Jeremy Won Gold Medal: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. వెయిట్‌లిఫ్టింగ్ 67 కిలోల కేటగిరీలో జెరెమీ లాల్రిన్నుంగా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
67 కేజీల విభాగంలో ఈ 19 ఏళ్ల కుర్రాడు.. రెండు కొత్త రికార్డులు సృష్టిస్తూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తిన జెరెమీ.. రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300కేజీలుకు పైగా ఎత్తి ఓవరాల్‌గా రికార్డు సృష్టించాడు. దాంతో పాటు 140 కేజీలకు పైగా ఎత్తి మరో రికార్డును తిరగరాశాడు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు చెందిన జెరెమీ.. ఏడేళ్ల ప్రాయంలోనే వెయిట్‌లిఫ్టింగ్ వైపు అడుగులు వేశాడు. 2018 యూత్ ఒలింపిక్స్ 62 కేజీల విభాగంలో పసిడి సాధించాడు. గత కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని సాధించాడు.
ఇండియన్ ఆర్మీ అభినందనలు.. బంగారు పతకాన్ని గెలుచుకున్న జెరెమీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేక మంది ప్రముఖులు అభినందించారు. వారితో పాటు భారత ఆర్మీ.. 'నాయబ్ సుబేదార్ జెరెమీ లాల్రిన్నుంగాకు అభినందనలు' అంటూ ట్వీట్ చేసింది.
'ప్రాక్టీస్‌లో 140 కేజీలు ఎత్తలేదు'.. బంగారు పతకాన్ని గెలుచుకున్న జెరెమీ.. భారత్‌కు రెండో స్వర్ణాన్ని అందించడం పట్ల తాను గర్వపడుతున్నట్లు చెప్పాడు. కానీ తాను ఇంకా మెరుగైన ప్రదర్శను చేస్తానని ఆశించినట్లు తెలిపాడు."ప్రాక్టీస్ బాగానే చేశాను. పోటీలో వెయిట్ లిఫ్టింగ్ మొదలుపెట్టాక తొడ కండరాలు తిమ్మిరి ఎక్కడం ప్రారంభమైంది. దాని వల్ల పోటీ పూర్తయ్యాక కాసేపు నడవలేకపోయాను. అయితే ప్రాక్టీస్‌లో మాత్రం 140 కేజీలు ఎత్తలేదు." అని జెరెమీ చెప్పుకొచ్చాడు.
వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో శనివారం స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను.. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. 49కేజీల విభాగంలో స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. మొత్తంగా 201 కేజీల బరువును ఎత్తి ఈ ఘనత సాధించింది. ఇప్పటివరకు భారత్ 5(2 స్వర్ణం, 2 రజతం, 1 కాంస్యం) పతకాలను ఖాతాలో వేసుకుంది.
ఇవీ చదవండి: అదరగొట్టిన వెయిట్‌లిఫ్టర్లు.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 4 పతకాలు
భారత్ బోణీ.. వెయిట్ లిఫ్టింగ్‌లో రెండు పతకాలు.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి!