ETV Bharat / sports

చదరంగంలో 'అతిపిన్న' అభిమన్యుడు

author img

By

Published : Jul 2, 2021, 7:38 AM IST

అది న్యూ జెర్సీ ఓపెన్ చెస్ టోర్నీ.. బోర్డుకు ఓ వైపు ఐదున్నరేళ్ల బాలుడు.. మరోవైపు ప్రత్యర్థేమో తన కంటే అయిదు రెట్లు ఎక్కువ వయసున్న ఆటగాడు. పోరు మొదలైంది.. మరొక్క ఎత్తు వేస్తే ఆ బాలుడికి విజయం దక్కుతుంది. కానీ అప్పటికే అర్ధరాత్రి దాటడం వల్ల అతనికి నిద్ర తన్నుకు వస్తోంది. కళ్లు మూసుకు పోతున్నాయి. ఇదే అదునుగా తీసుకున్న ప్రత్యర్థి.. గంట వరకూ తన పావు కదపకుండా ఉండిపోయాడు. ఇక లాభం లేదని ఆ బాలుడు డ్రా ప్రతిపాదన తెచ్చాడు. కానీ ప్రత్యర్థి ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలుడు మ్యాచ్​ను వదిలేసుకున్నాడు. అయితే అక్కడితోనే కథ ఆగిపోలేదు. అప్పుడే సరికొత్త ప్రస్థానం మొదలైంది. అదిప్పుడు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్​గా నిలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించే వరకూ వచ్చింది. ఆ బాలుడే అభిమన్యు మిశ్రా. మహాభారతంలో కౌరవుల పద్మవ్యూహానికి చిక్కి ఆ అభిమన్యుడు బలికాగా.. ఇప్పుడు ఈ భారత సంతతి అమెరికా అభిమన్యు మాత్రం చదరంగ వ్యూహాల్లో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ సాగుతున్నాడు.

abhimanyu mishra, chess grandmaster
అభిమన్యు మిశ్రా, చెస్​ గ్రాండ్​మాస్టర్​

పన్నెండేళ్ల వయసులో పిల్లలు మహా అయితే ఏం చేస్తారు? ఇంట్లో అల్లరి చేస్తూ.. సరదాగా ఆటలాడేస్తారు. కానీ న్యూజెర్సీకి చెందిన అభిమన్యు మిశ్రా మాత్రం ఆటతోనే చరిత్ర తిరగరాశాడు. 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న అతను.. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ఆ ఘనత సాధించిన చెస్ ఆటగాడిగా కర్జాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) రికార్డును బద్దలు కొట్టాడు. భారత సంతతి తల్లిదండ్రులకు పుట్టిన ఈ అమెరికా బాలుడు.. చదరంగంలో మనకు తిరుగులేదని మరోసారి చాటాడు. చెస్ బోర్డుపై బాల్యంలోనే ప్రేమ పెంచుకుని అరంగేట్రం నుంచే రికార్డుల వేటలో దూసుకెళ్తున్నాడు. 9 ఏళ్లకే యూఎస్ అతి పిన్న వయస్సు జాతీయ చెస్ మాస్టర్​గా నిలిచాడు. 10 ఏళ్ల 9 నెలలకే అతి పిన్న అంతర్జాతీయ మాస్టర్​గా నిలిచి భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రికార్డును చెరిపేశాడు. ఇప్పుడదే జోరులో తక్కువ వయసులోనే గ్రాండ్​మాస్టర్ హోదా సొంతం చేసుకున్నాడు. కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరం కాకుండా ఉంటే మరింత తక్కువ వయసులోనే అతనీ రికార్డు సాధించేవాడు.

రెండున్నరేళ్లకే..

మధ్యప్రదేశ్​కు చెందిన హేమంత్, స్వాతి దంపతులు 2006లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. తమ కొడుకు అభిమన్యును చెస్ ఛాంపియన్​గా చూడాలనేది వాళ్ల కల. ఆ పిల్లాడికి పూర్తిగా మాటలు కూడా రాకముందే.. రెండున్నరేళ్లకే తన తండ్రి కథలు చెబుతూ చదరంగ పావులను పరిచయం చేశాడు. అలా 64 గళ్లపై అతనికి ప్రేమ కలిగింది. అయిదేళ్లు వచ్చేసరికే తండ్రిని ఓడించే స్థాయికి చేరాడు. ఆ తర్వాత అకాడమీలో చేరి పావులపై పట్టు సాధించాడు. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో, ఆలోచనలతో ప్రత్యర్థులను చిత్తుచేయడం మొదలెట్టాడు. తనకంటే ఎంతో పెద్దవాళ్లతో పోటీపడి విజయాలు సాధించాడు. అండర్-9 విభాగంలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ కలిగిన ఆటగాడిగా నిలిచిన అతనికి దిగ్గజం కాస్పరోవ్ చెస్ ఫౌండేషన్ నుంచి ఆహ్వానం అందింది. ఆ సంస్థ నిర్వహిస్తున్న యంగ్ స్టార్స్ కార్యక్రమానికి అతను ఎంపికయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతని ఆటతీరును పరిశీలించి ఏడాదికి రెండు సార్లు కాస్పరోవ్ తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాడు.

ఆ సవాళ్లు దాటి..

వయసులో అభిమన్యు చాలా చిన్నవాడు కాబట్టి రాత్రుల్లో ఆలస్యంగా జరిగే టోర్నీల్లో నిద్రను ఆపుకోలేకపోయేవాడు. దీంతో ఓ సారి న్యూజెర్సీ ఓపెన్​లో ఓటమి చెందాల్సి వచ్చింది. ఆ సమస్యను అధిగమించేందుకు చాలా కసరత్తులు చేశాడు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మాస్టర్ హోదా కోసం ఓ టోర్నీకి ముందు తన ఇంట్లో తండ్రితో కలిసి ముందుగానే అక్కడి కాలమానానికి అలవాటు పడేందుకు రాత్రుల్లో 3 గంటల వరకూ మేల్కోనే ఉన్నాడు. విమానాల్లో గంటల పాటు ప్రయాణించినప్పటికీ ఆ అలసట అనేది లేకుండానే పోటీల్లో విజయాలు సాధించడం అతనికి పరిపాటిగా మారింది.

ఆర్థిక సమస్యలు

ఈ క్రమంలోనే ఆర్థికంగానూ సమస్యలు ఎదురయ్యాయి. గ్రాండ్ మాస్టర్​గా నిలిచేందుకు హంగేరీలో టోర్నీల కోసం అతని తండ్రి.. ఓ వెబ్​సైట్ ద్వారా సుమారు రూ.11.91 లక్షల నిధులు సేకరించాడు. ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న ప్రత్యర్థులను ఓడిస్తున్న అభిమన్యు ప్రపంచ ఛాంపియన్​గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇదీ చదవండి: ప్రపంచ రికార్డుతో టోక్యో పారాలింపిక్స్​కు దేవేంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.