ETV Bharat / sports

Asian Champions Trophy: నేడు పాకిస్థాన్​తో భారత్ ఢీ - భారత్ X పాకిస్థాన్ హాకీ మ్యాచ్

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్​లో నేడు(డిసెంబర్ 17) పాకిస్థాన్​తో తలపడనుంది భారత జట్టు. గత మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై 9-0తో గెలిచిన భారత్​.. పాక్​పై పైచేయి సాధించాలని చూస్తోంది.

team india hockey
టీమ్​ఇండియా హాకీ
author img

By

Published : Dec 17, 2021, 6:49 AM IST

గత మ్యాచ్‌లో విజయంతో జోరు మీదున్న భారత్‌.. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్​లో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మన జట్టు తలపడనుంది. 2018 మస్కట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్‌ వర్షం కారణంగా రద్దవడం వల్ల ట్రోఫీని పంచుకున్న భారత్‌-పాక్‌ జట్లు డిఫెండింగ్‌ ఛాంపియన్ల హోదాలో ఈసారి బరిలో దిగడం విశేషం. ఈ నేపథ్యంలో ఇరు ఛాంపియన్‌ జట్ల మధ్య జరిగే పోరు మరింత ఆసక్తిని రేపుతోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రాత్మక కాంస్య పతకం గెలిచిన తర్వాత తొలిసారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత్‌.. కొరియాతో తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0తో చిత్తు చేసింది. ఇదే ఊపులో పాక్‌ పని పట్టాలని మన జట్టు భావిస్తోంది. అయితే మిగిలిన జట్ల మీద ఎలా ఆడినా.. భారత్‌ అనగానే సర్వశక్తులూ కూడదీసుకునే పాక్‌తో మన జట్టుకు అంత సులభం కాబోదు. ఇటీవల దాయాదిపై మన జట్టు బాగానే ఆడినా.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో రికార్డు మాత్రం పాక్‌ వైపే ఉంది.

ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌-పాక్‌ తొమ్మిదిసార్లు తలపడితే పాక్‌ ఏడుసార్లు గెలవగా.. భారత్‌ రెండేసార్లు పైచేయి సాధించింది. చివరిగా ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌ దశలో పాక్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌తో నెగ్గింది. ఈసారి పాక్‌పై నెగ్గితే అయిదు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో మన జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌ స్టార్‌స్పోర్ట్స్‌-1లో ప్రసారం కానుంది.

ఇదీ చదవండి:

భారత హాకీకి కొవిడ్ దెబ్బ.. మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.