పిల్లల సంతోషం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు తల్లులు. జీవితంలో వారు విజయం సాధించడం కోసం తమ వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా.. కేరళలోని ఓ మహిళ.. తన కొడుకు కోసం ఫుట్‌బాల్ ట్రైనర్ అవతారమెత్తింది.
కేరళ మలప్పురం జిల్లాలోని అచనంబలం ప్రాంతానికి చెందిన హజర.. తన కొడుకు సాహద్తో కలిసి జీవిస్తోంది. ఫుట్‌బాలర్ అవ్వాలన్నది సాహద్ కోరిక. ఇందుకోసం తీవ్రంగా శ్రమించేవాడు. కానీ కరోనా లాక్‌డౌన్‌తో అతడి శిక్షణ నిలిచిపోయింది. ఇదే సమయంలో హజర తన కొడుకుకు అండగా నిలిచింది. ఆర్థిక సమస్యలన్నింటినీ పక్కనపెట్టి.. కొడుకుకు ఫుట్‌బాల్ ట్రైనర్‌గా మారింది.
సాహద్కు తమ అద్దె ఇంటి మీదే శిక్షణ ఇస్తోంది హజర. వీరి శిక్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సాహద్ ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. అతడు కొచ్చి సాకర్ లైన్ క్లబ్ సభ్యుడు కూడా. ఎప్పటికైనా భారత తరఫున ఫుట్‌బాల్ జట్టులో ఆడాలన్నది అతడి లక్ష్యం.
ఇదీ చూడండి- రిటైర్మెంట్లోపు ఆ రెండు పనులు చేయాలి: స్మిత్