ETV Bharat / sports

IND vs SA Series: సఫారీ గడ్డపై తిరుగులేని కోహ్లీ.. మరి ఈసారి? - విరాట్ కోహ్లీ వర్సెస్ సౌతాఫ్రికా

Virat Kohli stats vs South Africa: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తోంది భారత్. ఇక్కడి పిచ్​లపై కెప్టెన్ కోహ్లీకి మంచి ఫామ్​ ఉండటం కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాలో వన్డే, టెస్టుల్లో కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Virat Kohli vs south africa, Virat Kohli stats on South African pitches, విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా రికార్డు, విరాట్ కోహ్లీ లేటెస్ట్ న్యూస్
Virat Kohli
author img

By

Published : Dec 21, 2021, 9:59 AM IST

Virat Kohli stats vs South Africa: మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో తలపడనుంది టీమ్ఇండియా. ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్​ కైవస చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా ఎలాగైనా ట్రోఫీతో తిరిగి రావాలని పట్టుదలతో ఉంది కోహ్లీసేన. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఇప్పటికే ప్రాక్టీస్​లో చెమటోడుస్తున్నారు ఆటగాళ్లు. టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఇక టెస్టుల్లోనే అతడు సారథ్యం వహించనున్నాడు. దీంతో రెండేళ్ల నుంచి బ్యాటింగ్​లో విఫలమవుతున్న ఇతడు ఈ పర్యటనలో రెచ్చిపోవాలని చూస్తున్నాడు. ఇక్కడి పిచ్​లపై విరాట్​కు మంచి రికార్డే ఉంది. అదేంటో చూద్దాం.

టెస్టుల్లో..

సఫారీ గడ్డపై ఐదు టెస్టులాడిన కోహ్లీ 55.80 సగటుతో 558 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉండటం విశేషం.

వన్డేల్లో..

వన్డేల విషయానికి వస్తే ఇక్కడ 17 మ్యాచ్​లు ఆడిన కోహ్లీ 15 ఇన్నింగ్స్​ల్లో బ్యాటింగ్ చేశాడు. 87.70 సగటుతో 877 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 160గా ఉంది. ఇందులో 3 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ గణాంకాలు చాలు సౌతాఫ్రికా గడ్డపై కోహ్లీ ఎంతగా చెలరేగి ఆడతాడో చెప్పడానికి. ఈ పర్యటనలోనూ ఇదే ఫామ్​ను కొనసాగించాలని చూద్దాం.

India vs SA Series: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

ఇవీ చూడండి: Ind Vs SA Test: టీమ్​ఇండియాకు ఒకే ఒక ఆశ.. సఫారీ గడ్డపై ఈసారైనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.