ETV Bharat / sports

'టీ20లు ఆడేందుకు మేము రెడీ'- బీసీసీఐతో రోహిత్, విరాట్ - virat T20 selection

Virat Kohli Rohit Sharma T20 selection : టీ20 జట్టు ఎంపిక కోసం తాము అందుబాటులో ఉంటామని రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ బీసీసీఐ సెలక్షన్​ కమిటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీ20 వరల్డ్​ కప్​నకు ముందు జరిగే చివరి 3 టీ20ల్లో విరాట్​, రోహిత్ ఉంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఆ వివరాలు మీకోసం.

Virat Kohli Rohit Sharma T20 selection
Virat Kohli Rohit Sharma T20 selection
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 11:24 AM IST

Updated : Jan 5, 2024, 12:02 PM IST

Virat Kohli Rohit Sharma T20 selection : టీ20 ఫార్మాట్​లో ఎంపిక కోసం తాము అందుబాటులో ఉన్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్​, ఇంగ్లాండ్​తో టీ20, టెస్ట్​ సిరీస్​ల కోసం జట్టును ఎంపిక చేయడానికి శుక్రవారం సెలక్షన్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ప్లేయర్లు బోర్డుకు తెలియజేసినట్లు సమాచారం. అయితే 2022 టీ20 వరల్డ్​ కప్​లో చివరగా ఆడిన ఈ ప్లేయర్లు, అప్పటినుంచి పొట్టి ఫార్మాట్​లో మ్యాచ్​లు ఆడలేదు.

జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్​తో టీమ్ఇండియా మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత సొంత గడ్డపై జనవరి 25 మొదలుకానున్న 5 మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​లో ఇంగ్లాండ్​తో తలపడనుంది. అయితే టీ20 వరల్డ్​ కప్​నకు ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి 3 టీ20లకు, ఇంగ్లాండ్​ సిరీస్​లో మొదటి రెండు టెస్ట్​ మ్యాచ్​ల కోసం జట్లను ఎంపిక చేయడానికి శుక్రవారం బీసీసీఐ సెలక్షన్​ సమావేశం కానుంది.

ఇదిలా ఉండగా అఫ్గానిస్థాన్​తో జరగబోయే టీ20 సిరీస్​లో ఇద్దరు ఫాస్ట్​ బౌలర్లు మహ్మద్​ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి వారిని ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్ట్​ సిరీస్​కు జట్టులోకి తీసుకోవాలని, అప్పటివరకు వారు ఫుల్​ ఫిట్​గా ఉండాలని బోర్డు ఆశిస్తున్నట్లు సమచారం.
గురువారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది టీమ్ఇండియా. సఫారీలతో జరిగిన రెండు టెస్టుల్లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు రోజులలో ముగిసిన రెండో టెస్టులో ఇద్దరు ప్లేయర్లు వరుస వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించారు.

కెప్టెన్ ఎవరు?
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్​ పాండ్యకు గాయాలయ్యాయి. అఫ్గాన్​ సిరీస్​ జట్టు సెలక్షన్​కు వారు అందుబాటులో ఉండటం లేదు. దీంతో సెలక్షల్ కమిటీ కొత్త కెప్టెన్​ సారథ్య బాధ్యతు అప్పగించాల్సి వచ్చింది. ఒక వేళ రోహిత్​ను అఫ్గానిస్థాన్ సిరీస్​కు ఎంపిక చేస్తే కెప్టెన్​గా​ అతడే ఉండే అవకాశం ఉంది. లేకపోతే సెలెక్టర్స్​ కేఎల్​ రాహుల్​ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అదీ సాధ్యం కాకపోతే బుమ్రాకు కెప్టెన్​ పగ్గాలు అప్పజెప్పే అవకాశమూ లేకపోలేదు.

అలా జరగడం దురదృష్టకరం- ఈ గెలుపు క్రెడిట్ వారిదే: రోహిత్ శర్మ

'భారత్ పిచ్​లపై మాట్లాడే వారు నోరు మూసుకోవాలి- మా వద్ద బంతి తిరిగితే ఒప్పుకోరా?'

Last Updated : Jan 5, 2024, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.