Virat Kohli Punjabi: భారత టెస్టు క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి పంజాబీ కూడా వచ్చని మీకు తెలుసా..? అవునండి.. విరాట్ కోహ్లీ దిల్లీలో పుట్టినా.. అతడి కుటుంబం పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందినది. దీంతో కోహ్లీ పంజాబీ భాష మాట్లాడగలడు. అంతేకాకుండా కోహ్లీకి ఫుట్‌బాల్ ఆట అంటే కూడా తెగ ఇష్టం. ప్రీమియర్ లీగ్‌లో తన అభిమాన జట్టు మాంచెస్టర్ సిటీ టాప్‌లోకి దూసుకెళ్లడంపై మేనేజర్ పెప్ గార్డియోలాకు సోషల్ మీడియా వేదికగా పంజాబీలో శుభాకాంక్షలు చెప్పాడు. పెప్ గార్డియోలా, విరాట్ కోహ్లీ మంచి స్నేహితులు. ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన కోహ్లీ "పెప్, అంతా మంచే జరుగుతోంది. మీరు మాంచెస్టర్ సిటీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇక్కడితో ఆగిపోవద్దు.. ఈ టైటిల్‌ను మళ్లీ చేజిక్కించుకోవాలి" అని ఆకాంక్షించాడు. ప్రస్తుతం విరాట్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే కదా. మరి ఆ వీడియోను మీరూ వీక్షించండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పెప్ గార్డియోలా మాంచెస్టర్ టీమ్‌కు 2016 నుంచి మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు బార్సిలోనా జట్టుకూ మేనేజర్ పనిచేశాడు. అయితే పెప్ గార్డియోలా 2017-18, 2018-19, 2020-21 సీజన్లలో మాంచెస్టర్ సిటీని టైటిల్ విన్నర్‌గా నిలిపాడు. 2021-22 సీజన్ పాయింట్ల పట్టికలో మాంచెస్టర్ సిటీ టాప్ స్థానంలోకి దూసుకెళ్లింది. మరి ఈసారి కూడానూ విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: