Virat Kohli Medal : ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో.. మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. అతడి బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. దీంతో అక్కడే సెకెండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్.. ఎడమవైపు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ ఒడిసిపట్టాడు. దీంతో ఒక్కసారిగా మార్ష్ షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న సమయంలో భారత ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ విరాట్‌కు ఓ పతకాన్ని మెడలో వేశాడు. ఈ మ్యాచ్ ఫీల్డింగ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను కోహ్లికి ఈ మెడల్ వేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక పోర్టల్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 'మనం చేసే పనుల్లో కాస్త వైవిధ్యం ప్రదర్శిస్తే మంచి గుర్తింపు సాధించవచ్చు' అని పేర్కొన్నారు. ఇందుకుగాను విరాట్ డైవింగ్ క్యాచ్‌కు దిలీప్ అత్యుత్తమ ఫీల్డర్ పతకాన్ని అందజేశారు అని అన్నారు. అయితే ఉత్తమ ఫీల్డర్‌గా విరాట్ పేరు అనౌన్స్ చేయగానే అతడు ముఖంపై చిరునవ్వుతో పరిగెత్తుతూ దిలీప్ వద్దకు చేరుకున్నాడు. మెడలో పతకం వేయగానే విరాట్ దాన్ని ముద్దుగా కొరికాడు.
-
📽️ BTS from the #TeamIndia 🇮🇳 dressing room 😃👌 - By @28anand
— BCCI (@BCCI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A kind of first 🥇 #CWC23 | #INDvAUS
And the best fielder of the match award goes to....🥁
WATCH 🎥🔽https://t.co/wto4ehHskB
">📽️ BTS from the #TeamIndia 🇮🇳 dressing room 😃👌 - By @28anand
— BCCI (@BCCI) October 9, 2023
A kind of first 🥇 #CWC23 | #INDvAUS
And the best fielder of the match award goes to....🥁
WATCH 🎥🔽https://t.co/wto4ehHskB📽️ BTS from the #TeamIndia 🇮🇳 dressing room 😃👌 - By @28anand
— BCCI (@BCCI) October 9, 2023
A kind of first 🥇 #CWC23 | #INDvAUS
And the best fielder of the match award goes to....🥁
WATCH 🎥🔽https://t.co/wto4ehHskB
World Cup Kohli Catches : ఈ సూపర్ క్యాచ్‌తో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక క్యాచ్‌లు(వికెట్ కీపర్ కాకుండా) పట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మిచిల్ మార్ష్ క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. కాగా, ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో కోహ్లీ 15 క్యాచ్‌లను పట్టుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(14) పేరిట ఉండేది. తాజాగా పట్టిన క్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. మాజీ దిగ్గజ క్రికెటర్స్ కపిల్ దేవ్, సచిన్ 12 క్యాచులు అందుకున్నారు.
Ind vs Aus World Cup 2023 : కోహ్లీ-కేఎల్ రాహుల్ సూపర్ షో.. ప్రపంచకప్‌లో టీమ్ఇండియా శుభారంభం