ETV Bharat / sports

టీమ్​ఇండియాకు బిగ్​ షాక్​.. శ్రీలంక సిరీస్​కు కోహ్లీ, రోహిత్​, రాహుల్​ డౌట్​! - virat kohli rohithsharma

కొత్త ఏడాదిలో శ్రీలంక‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమ్​ఇండియా సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీతో పాటు ఓపెన‌ర్ కేఎల్ రాహూల్ దూరం కానున్న‌ట్లు తెలిసింది.

virat-kohli-kl-rahul-may-likely-to-out-of-sri-lanka-t20-series

author img

By

Published : Dec 25, 2022, 9:46 AM IST

శ్రీలంక‌తో జరిగే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ, రాహుల్ దూరం కానున్న‌ట్లు తెలిసింది. వారితో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండే అవ‌కాశం లేద‌ని స‌మాచారం. గాయం తీవ్రత త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో రోహిత్ శ‌ర్మ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండే అవ‌కాశం త‌క్కువేన‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు.

రోహిత్​కు తగ్గని గాయం!
వ‌న్డే సిరీస్‌తో తిరిగి రోహిత్​ జ‌ట్టులో చేరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మెడిక‌ల్ టీమ్ నిర్ణ‌యాన్ని అనుస‌రించే రోహిత్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డంపై ఓ క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. రోహిత్ ఇంజురీ విష‌యంలో రిస్క్ తీసుకోవ‌ద్ద‌నే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉందట. టీ20 సిరీస్‌కు అత‌డు అందుబాటు ఉండే ఛాన్స్ లేక‌పోవ‌డంతో కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని హార్దిక్ చేప‌ట్ట‌బోతున్న‌ట్లు తెలిసింది.

కోహ్లీకి విశ్రాంతి!..
శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వ‌నున్న‌ట్లు తెలిసింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత కోహ్లీ గ్యాప్ లేకుండా వ‌రుస‌గా సిరీస్‌లు ఆడుతూ వ‌స్తున్నాడు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కోహ్లీకి విశ్రాంతి నివ్వాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. వ‌న్డేల్లో అత‌డు ఆడే అవ‌కాశం ఉందని సమాచారం.

పెళ్లి కార‌ణంగా రాహుల్ దూరం!
టీమ్​ఇండియా ఓపెన‌ర్ కెేఎల్ రాహుల్ శ్రీలంక సిరీస్ మొత్తానికి దూరం కానున్న‌ట్లు తెలిసింది. జ‌న‌వ‌రిలో తన ప్రియురాలు అతియాశెట్టిని రాహుల్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పెళ్లి కార‌ణంగానే అత‌డు శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ సిరీస్ నుంచి బ్రేక్ కావాల‌ని అత‌డే బీసీసీఐ వ‌ర్గాల‌ను కోరిన‌ట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.